అబద్దాలు ఆరు రూపాలైతే అది వీరే: మంత్రి చెల్లుబోయిన

వైసీపీ కులగణన తెలిశాక టీడీపీ వారికి కూసాలు కదిలాయని కౌంటర్ వేశారు మంత్రి చెల్లుబోయిన. తాము చేసే కులగణన చరిత్రలో నిలిచిపోతుందని ధీమ వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అబద్దాలు ఆరు రూపాలుగా చంద్రబాబు, పవన్, రామోజీరావు, రాధాకృష్ణ నిలిచారని మండిపడ్డారు.

New Update
అబద్దాలు ఆరు రూపాలైతే అది వీరే: మంత్రి చెల్లుబోయిన

సోషల్ జస్టిస్ ఆచరించటంలో జగన్ విజయం సాధించారని కీర్తించారు. కులగణన పై నాలుగు ప్రాంతాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతున్నట్లు తెలిపారు. ఈనెల 27 నుండి కులగణన చేయాలనుకున్నామని..కానీ, మరికొద్ది రోజులు వాయిదా వేశామని అన్నారు. డిసెంబరు పది నుండి కులగణన చేస్తామని స్పష్టం చేశారు. క్రింది స్థాయి నుండి వచ్చే అందరి సూచనలు తెలుసుకుంటున్నందున పది రోజులు ఆలస్యం అవుతోందని పేర్కొన్నారు.

Also Read: హీరో బాలకృష్ణకు ఎమ్మెల్సీ సునీత మాస్ వార్నింగ్.!

బీహార్ లో చేసిన కులగణనను పరిశీలించామని..అందులో కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని వెల్లడించారు. వైసీపీ కులగణన తెలిశాక టీడీపీ వారికి కూసాలు కదిలాయన్నారు.  బీసీలను తోలు తీస్తాం, తోకలు కట్ చేస్తానని చంద్రబాబు అన్నారని.. జగన్ మాత్రం అక్కున చేర్చుకున్నారన్నారు. వాలంటీర్లు ఈ కులగణనలో పాల్గినకూడదని.. టీడీపీ వారు విమర్శలు చేస్తున్నారని సూచించారు. అసలు వాలంటీర్ల గురించి మాట్లాడే అర్హత టీడీపీ కి లేదని దుయ్యబట్టారు.

తాము చేసే కులగణన చరిత్రలో నిలిచిపోతుందని ధీమ వ్యక్తం చేశారు. ఐదు రీజనల్ మీటింగులు, జిల్లాల మీటింగులు నిర్వహించి సూచనలు‌ తీసుకున్నట్లు తెలిపారు. ఇంకా మండలాల స్థాయిలో కూడా చేయాలనుకుంటున్నామని తెలిపారు. దీంతో, టీడీపీ వారికి కూసాలు కదిలి, ఏం మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదని కౌంటర్లు వేశారు. చంద్రబాబు ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి ఈరోజు మళ్ళీ దండాలు పెడుతున్నారని విమర్శలు గుప్పించారు. అబద్దాలు ఆరు రూపాలుగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, రామోజీరావు, రాధాకృష్ణ నిలిచారని మండిపడ్డారు.

Advertisment
తాజా కథనాలు