Botsa Sathya Narayana: ఆ రెండు పత్రికలు ప్రజల్ని ఫుల్స్ చేస్తున్నాయి: బొత్స

పెన్షన్లలను అడ్డుకోవడమే కాకుండా.. తప్పుడు వార్తలు రాస్తూ ప్రజలను ఫూల్స్‌ చేస్తున్నాయని ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. నీచ రాజకీయాలు చేస్తున్న టీడీపీ చీఫ్‌ చంద్రబాబును దేవుడు కూడా క్షమించడని ధ్వజమెత్తారు.

New Update
Botsa Sathya Narayana: ఆ రెండు పత్రికలు ప్రజల్ని ఫుల్స్ చేస్తున్నాయి: బొత్స

ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్లలను అడ్డుకోవడమే కాకుండా.. తప్పుడు వార్తలు రాస్తూ ప్రజలను ఫూల్స్‌ చేస్తున్నాయని మండిపడ్డారు. పెన్షన్లకు సంబంధించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది ఎవరని ప్రశ్నించారు. సిటిజన్‌ ఫర్ డెమొక్రసీ అనే పేరుతో.. ఈసీకి ఫిర్యాదు చేశారని ఈ సంస్థకు నిమ్మగడ్డ రమేష్ అధ్యక్షుడని పేర్కొన్నారు. రాష్ట్రంలో నీచ రాజకీయాలు చేస్తున్న టీడీపీ చీఫ్‌ చంద్రబాబును దేవుడు కూడా క్షమించడని ధ్వజమెత్తారు.

Also Read: కేశినేని నాని లాగా నేను దిగజారలేదు.. లూజ్‌ కామెంట్స్‌ అంటూ సుజనా ఫైర్!

నిమ్మగడ్డను అడ్డుపెట్టుకొని కుట్ర

60 లక్షల మంది పేదవారికి పెన్షన్లు ఇస్తుంటే దీన్ని అడ్డుకోవడం సరైంది కాదని బొత్స అన్నారు. పెన్షనర్లకు, వికలాంగులకు వీళ్లందరూ ఏం సమాధానం చెబుతారంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో 3 లక్షల మంది చేస్తున్న పనిని సచివాలయం ఉద్యోగులతో చేయించడం వీలు అవుతుందా అంటూ ప్రశ్నించారు. నిమ్మగడ్డను అడ్డుపెట్టుకొని కుట్రకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇన్ని నెలల పాటు వాలంటీర్లు గ్రామాల్లో పెన్షన్లు పంపిణీ చేస్తే.. అప్పుడు రాని ఇబ్బంది ఇప్పుడు ఎందుకొచ్చిందటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గంటా పోయి కళా వచ్చాడు

అలాగే తన నియోజకవర్గంలో మూడు అక్షరాల గంటా పోయి.. రెండు అక్షరాల కళా వచ్చాడని ఇంతకు మించిన మార్పు ఏమి జరగలేదని వ్యాఖ్యానించారు. ఇదిలాఉండగా.. ప్రస్తతం ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష నేతల ఎన్నికల రంగంలోకి దిగిపోయారు. ఇక ఏప్రిల్ 19 నుంచి జూన్‌ 1 వరకు పార్లమెంటు ఎన్నికలు, అలాగే ఏపీతో సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇక మే 13న ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి.

Also Read: కడప జిల్లా రాజంపేట టీడీపీలో అసమ్మతి సెగలు

Advertisment
Advertisment
తాజా కథనాలు