Ambati Rambabu: ఇద్దరు పీకేలు కలిసినా పీకేదేమీ లేదు.. ప్రశాంత్ కిషోర్ తో టీడీపీకి ప్రయోజనం సున్నా: అంబటి ఫైర్

ప్రశాంత్ కిశోర్ ఈ రోజు చంద్రబాబుతో కలవడంపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. వ్యూహకర్త ఎంత గొప్పవాడైనా.. పార్టీకి దమ్ము లేనప్పుడు ఉపయోగం ఉండదన్నారు. చంద్రబాబు నైతికంగా ఎంత నీచమైన పరిస్థితికి దిగజారాడో దీన్ని బట్టి అర్థం అవుతోందన్నారు.

New Update
Ambati Rambabu: సీఎంల భేటీపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మూడు ప్రశ్నలు

కొద్ది నెలల క్రితం వరకు వైసీపీ కోసం పని చేసిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ (Prashanth Kishore).. చంద్రబాబుతో (Chandrababu) భేటీ కావడం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) స్పందించారు. ఈ అంశంపై ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబును కలవడం వల్ల మార్పులు ఏమీ ఉండవన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడిన మాటలు అందరికీ తెలుసన్నారు. పీకేను గతంలో బాబు బీహార్ డెకాయిట్ అన్న విషయాన్ని గుర్తు చేశారు అంబటి. అలాంటి పీకే ఇప్పుడు చంద్రబాబుకు దిక్కయ్యాడని ఎద్దేవా చేశారు.
ఇది కూడా చదవండి: AP Politics : జగన్‌కు పీకే ఝలక్‌.. ఇక టీడీపీ కోసం వ్యూహాలు.. ఇదిగో ప్రూఫ్!

చంద్రబాబు నైతికంగా ఎంత నీచమైన పరిస్థితికి దిగజారాడో దీన్ని బట్టి అర్థం అవుతోందన్నారు. అవసరమైనప్పుడు చంద్రబాబు ఎలా కాళ్లు పట్టుకుంటాడో జనానికి తెలుస్తోందన్నారు. వ్యూహకర్త ఎంత గొప్పవాడైనా ఆ పార్టీకి దమ్ము లేనప్పుడు ఉపయోగం ఉండదన్నారు. ఎంతమంది వ్యూహకర్తలు వచ్చినా టీడీపీకి ప్రయోజనం ఉండదన్నారు. రాబిన్ సింగ్ పనికిరాడని ఇప్పుడు పీకేను రంగంలోకి దించాడన్నారు.

టీడీపీకి ప్రాణం పోయడానికి చంద్రబాబు పనికిరాడన్నారు. చనిపోయిన టీడీపీకి పోస్టుమార్టం చేయడానికి మాత్రం పనికి వస్తాడన్నారు. ఇద్దరు పీకేలు కలిసినా పీకేదేమీ లేదని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు అంబటి. వారు రేపు వ్యూహం సినిమా చూసి వెళ్లిపోవడం తప్ప మరో మార్గం లేదని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

Advertisment
తాజా కథనాలు