Andhra Pradesh: నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర, ముగింపు సభ అట్టర్ ఫ్లాప్ అయ్యాయని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. అసలు యువగళం పాదయాత్ర ఎందుకు చేశారో వారికి కూడా తెలియదని ఎద్దేవా చేశారు. 6 లక్షల మంది వస్తారంటూ అబద్దపు ప్రచారాం చేశారని, చివరకు ప్రజలకు లేక సభ వెలవెలబోయిందన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన మంత్రి అంబటి రాంబాబు.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పొత్తుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు- పవన్ కలసి పోటీ చేస్తారని మొదటి నుంచి చెబుతున్నామని అన్నారు. ఒకరితో ఉంటూ మరొకరితో సంసారం చేయటం పవన్ కళ్యాణ్ కు అలవాటేనంటూ ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు మంత్రి అంబటి.
టీడీపీ ప్రభుత్వం ఉన్న ఐదేళ్లు పవన్ కల్యాణ్ ఏనాడూ ప్రశ్నించలేదని విమర్శించారు మంత్రి అంబటి. టీడీపీని బలోపేతం చేసేందుకే జనసేన పార్టీని ఏర్పాటు చేశారని అన్నారు. జనసేన ప్యాకేజీ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని, ప్యాకేజీ మాట్లాడుకొనే పవన్ కల్యాణ్ యువగళం సభకు వచ్చారని ఆరోపించారు అంబటి రాంబాబు.
ఇదే సమయంలో నారా లోకేష్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు మంత్రి అంబటి రాంబాబు. లోకేష్ బుద్ధి, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు ఏపీలో ఇళ్లు లేవని, వీరు నాన్ లోకల్స్ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, పవన్, లోకేష్, బాలకృష్ణ ఏకమైనా జగన్‌ను ఏమిచేయలేరని అన్నారు. చంద్రబాబు పాలనలో ఇచ్చిన ఏ హామీని కూడా నేరవేర్చలేదన్నారు.
చంద్రబాబుకు వయస్సు అయిపోయిందని, లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయాడానికి తపన పడుతున్నాడని వ్యాఖ్యానించారు మంత్రి. లోకేష్‌కు ఏమాత్రం నాయకత్వ లక్షణాలు లేవన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక.. 90శాతం సంక్షేమ పథకాలు ఇచ్చామని పేర్కొన్నారు మంత్రి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్, బాలయ్య, పవన్ ఓడిపోవటం ఖాయమన్నారు. జగన్ దూషించడం కోసమే యువగళం ముగింపు సభను ఏర్పాటు చేశారని విమర్శించారు.
Also Read:
ప్రశాంత్ నేర చరిత్రపై పోలీసుల స్పెషల్ ఫోకస్.. వెలుగులోకి భయంకరమైన నిజాలు
ఇరిగేషన్ అధికారులకు సీఎం కీలక ఆదేశాలు.. ఆ విషయాలు దాస్తే చర్యలు ఉంటాయని వార్నింగ్!