Ambati Rambabu: నేను దాడులను ప్రోత్సహించే వ్యక్తిని కాదు అంటూ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) తెలిపారు. ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి మంచిది కాదని మంత్రి పేర్కొన్నారు. జరిగే దాడులనూ అందరూ ఖండించాల్సిందేనన్నారు. తొండపి లో అప్పుడప్పుడూ గొడవలు జరుగుతుంటాయి.
గతంలో కూడా నేను వెళ్లిన సమయంలో అక్కడ గొడవలు జరిగాయి. అక్కడ నేను నిర్వహించే సభ గురించి టీడీపీ (TDP) నేత కన్నా ముందుగానే పోలీసులకు ఓ మాట చెప్పి ఉండాల్సిందని అంబటి పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి అడుగు పెట్టిన చిన్న పిల్ల షర్మిల (Sharmila)..ఆమె కూడా అన్న జగన్ (Jagan) ని విమర్శించే స్థాయికి ఎదిగింది.
పిచ్చి పిల్ల ఓవర్ యాక్షన్ చేస్తుందంటూ అంబటి విమర్శించారు. షర్మిల కొద్ది రోజుల క్రితం గుండ్లకమ్మ ప్రాజెక్టును వైసీపీ నేతలు కానీ, నీటి పారుదలశాఖ మంత్రి అంబటి రాంబాబు కానీ పట్టించుకోకుండా గాలికి వదిలేశారని విమర్శలు చేశారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు నీటిలో తేలుతుంటే..సంబంధింత మంత్రి మాత్రం సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతున్నారని షర్మిల అన్న మాటలు వైరల్ గా మారాయి.
ఈ క్రమంలోనే షర్మిల పై అంబటి షాకింగ్ కామెంట్లు చేశారు.
ఈ క్రమంలోనే ఆయన గుంటూరు మిర్చి యార్డులో వర్గ పోరు లేదని స్పష్టం చేశారు. చిన్న చిన్న అభిప్రాయ బేధాలుంటే సరిదిద్దుకుంటాం. మరోసారి అందరం కలిసి జగన్ నాయకత్వంలో పని చేస్తామని తెలిపారు.
Also read: చంద్రబాబు నాయుడికి తృటిలో తప్పిన ప్రమాదం!