/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/pk-vs-ambati-jpg.webp)
Ambati Rambabu Vs Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మరోసారి విమర్శల దాడికి దిగారు మంత్రి అంబటి రాంబాబు. పవన్ కళ్యాణ్ నాల్గవ భార్య విడాకులకు కూడా జగన్ కారణం అనే విధంగా పవన్ వ్యవహార శైలి ఉందంటూ ఫైర్ అయ్యారు.
విశాఖ ఫీషింగ్ హార్బర్ ఘటనలో ముఖ్యమంత్రి జగన్ చాలా వేగంగా స్పందించారని మంత్రి అంబటి పేర్కొన్నారు. బాధితులు అందరికి నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేసిందని తెలిపారు. ఇంత స్పీడ్ గా స్పందించి ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేదని అనేకమంది కొనియాడారని అన్నారు.
ALSO READ: కొత్త రేషన్ కార్డులపై కేటీఆర్ సంచలన ప్రకటన!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అఘామేఘాల మీద వచ్చి ముఖ్యమంత్రి మీద విమర్శలు చేశాడని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఏం జరిగినా ముఖ్యమంత్రి కారణం అంటూ పవన్ మాట్లాడం సిగ్గు చేటు అని అన్నారు.
ఆఖరికి పవన్ కళ్యాణ్ నాల్గవ భార్య విడాకులకు కూడా జగన్ కారణం అనే విధంగా పవన్ వ్యవహార శైలి ఉందని ధ్వజమెత్తారు.
స్పెషల్ ఫ్లైట్స్ లో వచ్చినా.. నష్టపరిహారం ఇచ్చినా అది ప్యాకేజి డబ్బే అని విమర్శించారు. ఏపీకి పవన్ కళ్యాణ్ కి సంబంధం ఏంటి? అని ప్రశ్నించారు. ప్యాకేజి తీసుకుని అప్పుడప్పుడు వచ్చి ముఖ్యమంత్రి మీద విమర్శలు చేసి వెళ్లిపోతావు.. నీకు ఏపీకి ఎలాంటి సంబంధం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ ది బానిస బ్రతుకు అని అన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పులు మోస్తున్నాడని విమర్శించారు. కాపు సామజిక వర్గాన్ని చంద్రబాబుకి తాకట్టు పెట్టాలని చూస్తూన్నాడని ఆరోపించారు. చంద్రబాబు పల్లకి మోయడానికి పవన్ రాజకీయాలు చేస్తున్నాడని పేర్కొన్నారు. పవన్ లాంటి వారిని కాపు సామాజిక వర్గం నాయకుడుగా ఒప్పుకోదని తెలిపారు. కాపు జాతిని అమ్ముకుని బ్రతకడానికే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడని ఫైర్ అయ్యారు.
ALSO READ: పెన్షన్ రూ.5000.. కేసీఆర్ సంచలన ప్రకటన!
పవన్ కళ్యాణ్.. నువ్వు నటుడివా.. విటుడివా... ఏం బ్రతుకు నీది అంటూ ధ్వజమెత్తారు అంబటి. తెలంగాణలో బీజేపీ జెండా పట్టుకుంటాడు.. ఏపీలో తెలుగుదేశం జెండా మోస్తున్నాడని విమర్శించారు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం, బీజేపీలకీ రెండవ పెళ్ళాం లాగా మారిపోయాడని సెటైర్లు వేశారు. నువ్వు పవన్ కళ్యాణ్ కాదు... కిరాయి కళ్యాణ్ అంటూ ఎద్దేవా చేశారు. పవన్ జీవితం మొత్తం చంద్రబాబు పల్లకి మోయడామే అని అన్నారు.