India : 2025 నాటికల్లా భారతీయులందరికీ కనీస వేతనాలు!

2025 నాటికల్లా భారతీయులందరీకీ కనీస వేతనాలు అందేలా భారత ప్రభుత్వం యోచిస్తోంది. ILO మద్దతుతో పేదరిక నిర్మూలనతోపాటు అందరికీ ఆరోగ్యం, ఉన్నత విద్యను అందించేలా స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను నేరవేర్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

New Update
India : 2025 నాటికల్లా భారతీయులందరికీ కనీస వేతనాలు!

Delhi : 2025 నాటికల్లా భారతీయులందరీకీ(Indians) కనీస వేతనాలు(Minimum Wages) అందేలా భారత ప్రభుత్వం యోచిస్తోంది. ILO మద్దతుతో పేదరిక నిర్మూలనతోపాటు అందరికీ ఆరోగ్యం, ఉన్నత విద్య అందించేలా స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను నేరవేర్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

2025 నాటికి కనీస వేతనం..
అంతర్జాతీయ కార్మిక సంస్థ(International Labor Organization) నుంచి సాంకేతిక సహాయాన్ని కోరుతూ.. 2025 నాటికి జీవన వేతనంతో కనీస వేతనాన్ని భర్తీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక అవసరాల పెరుగుదల, జీవన వేతనాల డేటాను ILOనుంచి సేకరించిన ప్రభుత్వం.. ఆహారం, ఆరోగ్య సంరక్షణ, విద్య, దుస్తులు వంటి ప్రాథమిక అవసరాలను తీర్చడానికి అవసరమైన ఆదాయ వనరులను సమకూర్చే దిశగా ప్రయత్నాలు చేస్తోంది.

ఇది కూడా చదవండి : Bangalore : నీరు వృధా చేసిన 22 ఫ్యామిలీలకు రూ. 5 వేలు ఫైన్!

2030 నాటికి స్థిరమైన అభివృద్ధి..
భారతదేశంలో 50 కోట్లకుపైగా కార్మికులుండగా.. 90% అసంఘటిత రంగంలో ఉన్నట్లు లెక్కలు బయటపెట్టారు. అయితే వీరి రోజువారీ కనీస వేతనం దాదాపు రూ. 176గా ఉందని, అంతకంటే ఎక్కువ ఉన్నవారి సంఖ్య చాలా తక్కువగా ఉందని వెల్లడించారు.  'భారతదేశం 2030 నాటికి స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను నెరవేర్చడానికి ILO కట్టుబడి ఉంది. పేదరిక నిర్మూలను రూపుమాపేందుకు వేగవంతంగా వ్యూహలు రచిస్తున్నాం. ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలను కీలకమైన అంశాలుగా పరిగణిస్తున్నాం' అని కార్మిక కార్యదర్శి సుమితా దావ్రా తెలిపారు.

కనీస వేతన చట్టం-1948..
వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు చట్టబద్ధమైన వేతన నిర్ధారణ కమిటీ ఆవశ్యకతను 1943లో మూడవ త్రైపాక్షిక ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ గుర్తించింది. కార్మికులకు కనీస వేతన చట్టం రూపొందించాలని నిర్ణయించి ఏప్రిల్ 11, 1946 సంవత్సరంలో అప్పటి భారత ప్రభుత్వంలో ఉన్న లేబర్ మెంబర్ డా. బీఆర్. అంబేద్కర్ కనీస వేతన బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లును ఆమోదించటంలో కొంతజాప్యం జరిగింది. ఆఖరుకు బిల్లు ఆమోదించబడి అది కనీస వేతన చట్టం -1948గా అమలులోకి వచ్చింది. 15వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ 1957వ సంవత్సరంలో కనీస వేతనాలు శాస్త్రీయ పద్ధతులు ఏవిధంగా నిర్ణయించాలో సూత్రీకరించి ఇప్పటికి 65 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ఈ చట్టాన్ని సమగ్రంగా అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు