Congress MP Rahul Gandhi : మీడియా తీరుపై కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 150 మంది ఎంపీలను బయటకు పంపిస్తే.. మీడియాలో చర్చ లేదు కానీ.. సంబంధం లేని అంశంపై చర్చ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఆవరణలో బుధవారం నాడు మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా మిమిక్రీ వివాదంపై స్పందించారు. ఎవరూ ఎవరిని కించపరచలేదని క్లారిటీ ఇచ్చారు. ఉపరాష్ట్రపతిని ఎవరూ అవమానించలేదని స్పష్టం చేశారు. సస్పెన్షన్‌కు నిరసనగా విపక్ష ఎంపీలు పార్లమెంట్ ముందు కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. దానిని నేను నా మొబైల్‌లో వీడియో చిత్రీకరించాను. ఆ వీడియో నా ఫోన్‌లో ఉంది. కానీ, మీడియా దీనిని మరో రకంగా చూపించే ప్రయత్నం చేసిందంటూ అసహనం వ్యక్తం చేశారు. ఎవరూ ఎవర్నీ ఏమీ అనలేదన్నారు.
మీడియా కూడా పక్షపాతం వహించడం ప్రజాస్వామ్యానికి క్షేమం కాదని చురకలంటించారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). సభ నుంచి 150 మంది ఎంపీలను బయటకు గెంటేసినా మీడియా కనీసం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. ఇంత భారీ స్థాయిలో సస్పెన్లు చేయడం పార్లమెంట్ చరిత్రలో తొలిసారి అని, దీనిపై మీడియాలో కనీసం చర్చ లేదని విమర్శించారు. 'దేశానికి నష్టం చేసే అంశాలపై చర్చ ఉండదు.. అదానిపై చర్చ లేదు.. రాఫెల్‌పై చర్చ లేదు.. నిరుద్యోగంపై చర్చ లేదు.. మా ఎంపీలు నిరుత్సాహపడి బయట కూర్చున్నారు. కానీ, మీరు కేవలం మిమిక్రీని హైలైట్ చేస్తూ చర్చలు పెడుతున్నారు. ఇదే పద్ధతి. విపక్షను వీడండి. పక్షపాతం సరికాదు.' అని పేర్కొన్నారు రాహుల్ గాంధీ.
Also Read: రాత్రి 9 తరువాత బోజనం చేస్తున్నారా? ఎంత ప్రమాదో తెలుసా?
లోక్‌సభలో భద్రతా వైఫల్యంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ విపక్ష పార్టీల ఎంపీలు గత కొద్ది రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే, సభలో నిరసన వ్యక్తం చేసిన దాదాపు 150 మందికి పైగా ఎంపీలను సస్పెండ్ చేశారు. దీంతో సస్పెన్షన్‌కు గురైన సభ్యులంతా పార్లమెంట్ బయట కూర్చుని ప్రొటెస్ట్ చేశారు. ఈ సందర్భంలో విపక్ష ఎంపీలు మాక్ పార్లమెంట్ నిర్వహించారు. అయితే, రాజ్యసభ చైర్మన్ అయిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్‌ను ఇమిటేట్ చేశారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ. అది కాస్తా ఇప్పుడు వివాదాస్పదం అయ్యింది. ఆయన చర్యను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా అధికారపక్షం నేతలంతా ఖండించారు. ఇది దురహంకార చర్యగా పేర్కొన్నారు.
Also Read: సరిగా నిద్రపోవడం లేదా? క్యాన్సర్‌ను ఏరికోరి తెచ్చుకున్నట్లే..!