Mumbai: యాక్సిడెంట్ చేసిన తర్వాత గర్ల్ ఫ్రెండ్‌కు 40సార్లు ఫోన్..ముంబయ్ హిట్ అండ్ రన్ కేసు

ముంబయ్ వర్లీలో శివసేన నేత రాజేష్ షా కుమారుడు మిహిర్ చేసిన కారు యాక్సిడెంట్ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే మిహిర్‌ను, అతని తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు...ప్రమాదం చేసిన తర్వాత మిహిర్ తన గర్ల్‌ఫ్రెండ్‌కు 40సార్లు ఫోన్ చేశాడని చెప్పారు.

New Update
Mumbai: యాక్సిడెంట్ చేసిన తర్వాత గర్ల్ ఫ్రెండ్‌కు 40సార్లు ఫోన్..ముంబయ్ హిట్ అండ్ రన్ కేసు

యాక్సిడెంట్ చేయడమే కాకుండా దాని నుంచి తప్పించుకోవడానికి ఎవరికీ కనిపించకుండా దాక్కున్నాడు ముంబయ్‌లో ఓ మహిళ ప్రాణాలు పోవడానికి కారణమైన శివసేన నేత రాజేష్ షా కుమారుడు మిహిర్. ఇంట్లోనే మూడు రోజుల పాటూ దాక్కున్నాడు. దీనికి అతని కుటుంబం మొత్తం సహకరించింది. ఈ కారణంగానే రాజేష్ షా, అతని భార్య, కూతురులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. యాక్సిడెంట్ సమయంలో మిహిర్‌తో పాటూ ఉన్న అతని డ్రైవర్‌ను కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా మిహిర్ గర్ల్ ఫ్రెండ్ ను కూడా కస్టడీలో తీసుకుని విచారించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

మిహిర్ యాక్సిడెంట్ చేశాక కారును బాంద్రాలోని కాలా నగర్‌లో వదిలేసి, గోరెగావ్‌లో ఉన్న గర్ల్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు. అక్కడ రెండు గంటలు ఉన్నాడు. ఆమెకు మొత్తం విషయం చెప్పాడు. దాంతో గర్ల్ ఫ్రెండ్ మిహిర్‌ సోదరికి కారు ప్రమాదం గురించి సమాచారం ఇచ్చింది. అప్పుడు ఆమె వచ్చి అన్నను ఇంటికి తీసుకు వెళ్ళింది. తర్వాత కుటుంబ సభ్యులంతా కలిసి షాపుర్‌లోని రిసార్టుకు వెళ్లిపోయారు. అది ముంబయికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. తర్వాత స్నేహితుడితో పాటు తిరిగి ఇంటికి వచ్చాడు. అప్పుడే అతడి స్నేహితుడు 15 నిమిషాల పాటు ఫోన్ ఆన్‌ చేయడంతో లొకేషన్ ట్రేస్‌ చేసిన పోలీసులు మిహిర్‌ను అరెస్టు చేశారు. ఈ విషయాలను ఆధారంగా చేసుకుని ఇప్పుడు మిహిర్ గర్ల్ ఫ్రెండ్‌ను కూడా కస్టడీలోకి తీసుకునే యోచనలో ఉన్నారు ముంబయ్ పోలీసులు.

ఆదివారం తెల్లవారు ఝామున ముంబయ్‌లోని వర్లి ప్రాంతంలో మద్యం మత్తులో మిహిర్ స్కూటర్ మీద వస్తున్న ఓ జంటను గుద్దేశాడు. దాంతో వాళ్ళిద్దరూ చాలా దూరం వెళ్ళి పడ్డారు. దాంతో కింద పడిన మహిళ అక్కడిక్కడే మృతి చెందగా...ఆమె భర్త గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Also Read:Jammu-Kashmir: కఠువాలో ఎన్ కౌంటర్.. 2గంటలు, 5189 రౌండ్ల కాల్పులు

Advertisment
తాజా కథనాలు