Microsoft : అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్.. యాపిల్‌ ని దాటేసింది!

ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీ అయిన యాపిల్‌ కంపెనీని అధిగమించి మైక్రోసాఫ్ట్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది మొదటి నుంచి కూడా యాపిల్ కంపెనీ అమ్మకాలు తగ్గడంతో పాటు డిమాండ్ ఆందోళనల్ని ఎదుర్కొంటున్నట్లు సమాచారం

Microsoft : అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్.. యాపిల్‌ ని దాటేసింది!
New Update

Microsoft v/s Apple : ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీ అయిన యాపిల్‌(Apple) కంపెనీని అధిగమించి మైక్రోసాఫ్ట్(Microsoft)  నిలిచింది. ఈ ఏడాది మొదటి నుంచి కూడా యాపిల్ కంపెనీ అమ్మకాలు తగ్గడంతో పాటు డిమాండ్ ఆందోళనల్ని ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే గురువారం నాడు యాపిల్‌ కంపెనీని అధిగమించి అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్ నిలిచింది.

ఇప్పటికే మైక్రో సాఫ్ట్ షేర్లు ఈ ఏడాది ప్రారంభం నుంచి 1.5 శాతం పెరిగాయి. ఏఐ రేసులో మైక్రోసాఫ్ట్‌ 2.888 ట్రిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువను పెంచడం లో సహాయపడింది. ఏఐ విప్లవమే మైక్రోసాఫ్ట్ వృద్దికి మరింతగా కారణమవుతోందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే యాపిల్‌ కంపెనీ 2.871 ట్రిలియన్‌ మార్కెట్‌ విలువలో 0.9 శాతం తక్కువగా ఉంది.

ఇదేమి మొదటి సారి కాదు..

గడిచిన రెండు సంవత్సరాల కాలంలో యాపిల్‌ కంపెనీ వాల్యు మైక్రోసాఫ్ట్ కంటే తక్కువగా పడిపోయింది. మైక్రోసాఫ్ట్‌ అత్యంత విలువైన కంపెనీగా నిలవడం ఇదేమి మొదటి సారి కాదు. 2018 నుంచి కూడా కొన్నిసార్లు యాపిల్‌ కంపెనీని అధిగమించి అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది.

విలువ పెరగడంతో..

గడిచిన కొద్ది రోజుల నుంచి యాపిల్‌ కంపెనీ ఐ ఫోన్(iPhone) అమ్మకాలు చాలా తక్కువగా ఉన్నాయి దాని ప్రభావం కూడా కంపెనీ మీద భారీగా పడడంతో యాపిల్ కంపెనీ స్థాయి తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలోనే మైక్రోసాఫ్ట్ విలువ పెరగడంతో ముందుకు దూసుకెళ్లింది. 2021 లో కూడా కొవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో కూడా మైక్రోసాఫ్ట్ యాపిల్‌ ని అధిగమించింది.

ముఖ్యంగా యాపిల్‌ కంపెనీ పై చైనా ప్రభావం తీవ్రంగా ఉంది. రానున్న రోజుల్లో చైనా పని తీరు మరింత కంపెనీ విలువను దిగజార్చవచ్చని కొన్ని సంస్థలు పేర్కొంటున్నాయి. హువావే నుంచి తీవ్రమైన పోటీ ఉండడంతో పాటు , చైనా- అమెరికా మధ్య తలెత్తుతున్న ఉద్రిక్తతలు కూడా యాపిల్ కంపెనీ పై తీవ్రమైన ఒత్తిడిని తీసుకుని వస్తున్నాయి.

యాపిల్‌ కంపెనీ షేర్ల(Apple Shares) విలువ డిసెంబర్‌ 14 నాటికి 3.081 ట్రిలియన్‌ డాలర్లకు చేరాయి. డిసెంబర్‌ చివరి నాటికి 48 శాతంతో ముగిశాయి. ఇది మైక్రోసాఫ్ట్‌ 57 శాతం కన్నా తక్కువ. మైక్రోసాఫ్ట్ చాట్‌జీపీటీ మేకర్ ఓపెన్ఏఐతో టై ఆప్ కావడంతో దూసుకుపోతోంది.

Also read: ఈ పండుగ సమయంలో అందంగా కనిపించాలనుకుంటున్నారా..అయితే వీటినిట్రై చేయండి!

#business #apple #microsoft
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe