Microsoft : విండోస్ సమస్య పరిష్కరించాం : మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ విండోస్ లో శుక్రవారం తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల ప్రపంచవ్యాప్తంగా పలు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే.బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కు కారణమైన క్రౌడ్ స్ట్రైక్ అప్ డేట్ వెనక్కి తీసుకుంది. డీబగ్ ను రూపొందించామని,సమస్య పరిష్కారమైనట్లు ప్రకటించింది. By Bhavana 19 Jul 2024 in బిజినెస్ ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి Microsoft Outage Has Fixed : మైక్రోసాఫ్ట్ విండోస్ (Microsoft Windows) లో శుక్రవారం తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల ప్రపంచవ్యాప్తంగా పలు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీని గురించి టెక్ దిగ్గజం స్పందించింది. సమస్య పరిష్కారం దిశలు చర్యలు చేపట్టింది. బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కు కారణమైన క్రౌడ్ సట్్రయిక్ అప్ డేట్ వెనక్కి తీసుకుంది. దీనికి డీబగ్ ను రూపొందించామని, ప్రస్తుతం సమస్య పరిష్కారమైనట్లు కంపెనీ ప్రకటించింది. కానీ ఇంకా మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ (Microsoft 365 Apps), సర్వీసుల్లో సమస్య కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అటు సైబర్ సెక్యూరిటీ (Cyber Security) సంస్థ క్రౌడ్ స్ట్రయిక్ సీఈఓ కుర్జ్ కూడా దీని పై స్పందించారు. సింగిల్ కంటెంట్ అప్ డేట్ లో బగ్ తో తలెత్తిన కస్టమర్లతో మా కంపెనీ సంప్రదింపులు జరుపుతోంది. మ్యాక్, లైనక్స్ సిస్టమ్ లపై ఎలాంటి ప్రభావం పడలేదు. అయితే ఇది భద్రతాపరమైన వైఫల్యమో, సైబర్ దాడో కాదు. సమస్యను గుర్తించి డీబగ్ ను ఫిక్స్ చేశాం. క్రౌడ్ స్ట్రయిక్ కస్టమర్ల భద్రతకు మేం పూర్తి ప్రాధాన్యమిస్తామని సీఈఓ ట్విటర్ వేదికగా వెల్లడించారు. Also read: హిందూ సంప్రదాయంలో వివాహ విశిష్టత గురించి వివరించిన ముఖేష్ అంబానీ #windows #microsoft #microsoft-outage మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి