CAA : ఎన్నికల వేళ హోంశాఖ కీలక నిర్ణయం..14 మందికి భారత పౌరసత్వం మంజూరు! దేశంలో ఎన్నికల వేళ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం (CAA) కింద 14 మంది వ్యక్తులకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేసింది. పౌరసత్వ ధ్రువీకరణ సర్టిఫికెట్ మొదటి సెట్‌ను బుధవారం అధికారికంగా జారీ చేసింది. By srinivas 15 May 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి MHA Issues First Citizenship Certificates : దేశంలో ఎన్నికల(Elections) వేళ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ(MHA) బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం(CAA) కింద 14 మంది వ్యక్తులకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేస్తూ.. పౌరసత్వ ధ్రువీకరణ సర్టిఫికెట్ మొదటి సెట్‌ను జారీ చేస్తున్నట్లు బుధవారం అధికారికంగా ప్రకటించింది. The first set of citizenship certificates after notification of Citizenship (Amendment) Rules, 2024 were issued today. Union Home Secretary Ajay Kumar Bhalla handed over citizenship certificates to some applicants in New Delhi today. Home Secretary congratulated the applicants… pic.twitter.com/RBTYSreN9O — ANI (@ANI) May 15, 2024 Also Read : వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో మెగా మోసం.. రూ. 54 లక్షలు పోగొట్టుకున్న గర్భిణి..! పౌరసత్వ (సవరణ) రూల్స్ 2024 నోటిఫికేషన్ తర్వాత మొదటి సెట్ పౌరసత్వ ధృవీకరణ పత్రాలు ఈ రోజు జారీ చేయబడ్డాయి. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా ఈరోజు న్యూఢిల్లీలో కొంతమంది దరఖాస్తుదారులకు పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా హోం సెక్రటరీ దరఖాస్తుదారులను అభినందించారు. అలాగే పౌరసత్వం (సవరణ) రూల్స్ 2024 ముఖ్య లక్షణాలను హైలైట్ చేస్తూ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఈ మేరకు డిసెంబర్ 2019లో CAA అమలులోకి రాగా.. 2014 డిసెంబర్ 31 లేదా అంతకు ముందు వేధింపులకు గురై భారతదేశానికి వచ్చిన పొరుగు దేశాల ముస్లిమేతర వలసదారులకు ఆశ్రయం అందించి, పౌరసత్వాన్ని కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి హింసించబడిన ముస్లిమేతర వలసదారులకు భారత జాతీయతను కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. #india #caa #citizenship-certificates మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి