TG News: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే బీజేపీలో విలీనం కాబోతుందంటూ కోమటి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, అందుకు సార్వత్రిక ఎన్నికలే బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నారు. కేసీఆర్ ప్రగతి భవన్, ఫామ్ హౌస్‌కు పరిమితమయ్యారంటూ విమర్శలు చేశారు.

TG News: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
New Update

Komati Reddy Sensational Comments On BRS Party: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, త్వరలోనే బీజేపీలో (BJP) విలీనం కాబోతుందంటూ కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఇప్పుడు ప్రగతి భవన్, ఫామ్ హౌస్‌కు పరిమితమయ్యారంటూ విమర్శలు చేశారు. ఈ మేరకు శనివారం మీడియాతో మాట్లాడిన మంత్రి.. రాష్ట్రంలో బీఆర్ఎస్ శకం ముగిసిందన్నారు. కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత హరీష్‌ రావుకు లేదని, ఆగష్టు 15 లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Jagan Residency : జగన్‌కు రేవంత్ సర్కార్ బిగ్ షాక్

అలాగే బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలు కడుతోందని మండిపడ్డారు. కాళేశ్వరం, మిషన్ భగీరథలో కోట్లలో అవినీతి జరిగిందని, కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు, విద్య గురించి కేసీఆర్ తన పాలనలో ఏ రోజూ పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ దక్షిణ తెలంగాణను చిన్నచూపు చూశారని, అందుకు ప్రతిఫలమే ఇటీవలి సార్వత్రిక ఎన్నికల ఫలితాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

#komati-reddy-venkat-reddy #brs #bjp
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe