Metro train: లేడీస్ కోచ్ ఎక్కిన పురుషులు.. చెంప దెబ్బలతో స్వాగతం పలికిన పోలీసులు! మెట్రో ట్రైన్ లేడీస్ కోచ్ లో ప్రయాణించిన పురుషులకు పోలీసులు చెంపదెబ్బతో స్వాగతం పలికారు. ఢిల్లీ మెట్రో చాలా రద్దీగా ఉండటంతో మహిళల కంపార్ట్ మెంట్లను సైతం వదలకుండా యువకులు ఎక్కేశారు. దీంతో స్త్రీ ల కంప్లైట్ తో పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. By srinivas 22 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Delhi: ట్రైన్, బస్సుల్లో మహిళలకు ప్రత్యేక సీట్లు కేటాయిస్తారు. అందులోకి పురుషులకు ప్రవేశం లేదని స్పష్టంగా బోర్డులు పెడతారు. అయితే పొరపాటున ఎవరైనా పురుషులు ఎక్కితే వెంటనే సిబ్బంది వారించి వదిలేస్తుంటారు. కానీ ఢిల్లీ మెట్రోలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. లేడీస్ కోచ్ ఎక్కి ప్రయాణించిన పురుషులను స్టేషన్ లోనే చెంప పగలగొట్టారు. ట్రైన్ లోపలికి వెళ్లి వీపులు పగలగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండగా వివరాలు ఇలా ఉన్నాయి. दिल्ली मेट्रो महिला कोच में सफर करने वालों देख लो!! pic.twitter.com/4kB9AiAopR — MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) June 19, 2024 ఈ మేరకు దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. మెట్రో రైలులోని మహిళా కోచ్‌లోకి పురుషులు ఎక్కువ మంది ఎక్కారు. దీంతో ఇబ్బంది పడిన మహిళలు దీని గురించి ఫిర్యాదు చేశారు. మెట్రో రైలు ఒక స్టేషన్‌కు చేరుకోగానే పోలీసులు అక్కడ సిద్ధంగా ఉన్నారు. లేడీస్ కోచ్‌లో ప్రయాణించిన మగవారిని చెంప దెబ్బలతో మహిళా పోలీసులు స్వాగతించారు. లోపల ఉన్న మరి కొందరు పురుష ప్రయాణికులను బలవంతంగా దించివేశారు. దీంతో లేడీస్ కోచ్ చాలా ఖాళీగా కనిపించింది. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. పోలీసుల చర్యను కొందరు సమర్థించగా మరికొందరు తప్పుపట్టారు. మగవారి చెంపలపైనా, భౌతికంగా మహిళా పోలీసులు కొట్టడాన్ని కొందరు ఖండించారు. లేడీస్ కోచ్‌లో ఎక్కిన లేదా ప్రయాణించిన పురుషులను ఇలా చెంపదెబ్బ కొట్టడం ఈ సమస్యకు పరిష్కారం కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. #police #delhi #metro మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి