Ice Water: పురుషులు ఎక్కువగా ఐస్ వాటర్ తాగితే నపుంసకత్వానికి గురవుతారని అంటుంటారు. ఇందులో ఎంత నిజం ఉంది. చల్లని నీరు ఎందుకు వంధ్యత్వానికి కారణమవుతుందనే దానిపై వైద్యులు క్లారిటీ ఇచ్చారు.పెద్ద మొత్తంలో చల్లటి నీటిని నిరంతరం తాగే పురుషుల్లో వంధ్యత్వం, అనారోగ్యకరమైన స్పెర్మ్ ఉత్పత్తి జరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఐస్ వాటర్ తాగితే:
- ఎక్కువ మొత్తంలో చల్లటి నీటిని తాగడం వల్ల సహజంగా శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. శరీర ఉష్ణోగ్రత చాలా చల్లగా ఉన్నప్పుడు స్క్రోటమ్‌లో స్పెర్మ్‌ల ఉత్పత్తి లోపం, అనారోగ్యకరమైన స్పెర్మ్‌లు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది.
థెరపీ ద్వారా స్పెర్మ్ ఉత్పత్తి అవుతుందా?
- స్క్రోటమ్ స్పెర్మ్‌ను ఉత్పత్తి చేసినప్పుడు అది విత్తనాలను స్క్రోటమ్ నుంచి శరీరం వెలుపలికి నెట్టివేస్తుంది. సరైన స్పెర్మ్ ఉత్పత్తి కోసం స్క్రోటమ్ ఉష్ణోగ్రత శరీరంలోని మిగిలిన ఉష్ణోగ్రత కంటే కొంచెం తక్కువగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వ్యక్తి ఎక్కువగా చల్లటి నీరు తాగడం వల్ల స్క్రోటమ్‌కు రక్త ప్రసరణ నిలిచిపోతుంది. దీని వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది.
రక్తనాళాల సంకోచం:
- ఎక్కువ మొత్తంలో చల్లటి నీటిని తాగడం వల్ల వాసోకాన్‌స్ట్రిక్షన్ సమస్యలు వస్తాయి. వాసోకాన్‌స్ట్రిక్షన్ అంటే స్క్రోటమ్‌లోని రక్తనాళాలు సంకుచితం చెందడమని వైద్యులు అంటున్నారు. ఈ రక్తనాళాలు కుంచించుకుపోయినప్పుడు జననాంగాలకు రక్త ప్రసరణ సరిగా ఉండదు. దానివల్ల అంగస్తంభన, స్పెర్మ్ ఉత్పత్తి లోపం వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
అసలు ఐస్ వాటర్ తాగకూడదా?
- కొన్ని సందర్భాల్లో ఐస్ వాటర్ తాగడం అంత హానికరం కాదని నిపుణులు అంటున్నారు. అయితే చల్లటి నీరు ఎక్కువగా తాగే వారికి ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: టీలో రస్క్ వేసుకుంటున్నారా..అయితే రిస్క్‌లో పడ్డట్టే
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: మజ్జిగ మంచిదే అయినా ఈ వ్యాధులు ఉంటే అస్సలు తాగొద్దు