/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-79-1-jpg.webp)
Mekala Shilpa: బీజేపీ (BJP) రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలిగా డాక్టర్ మేకల శిల్పా రెడ్డి (Mekala Shilpa) బాధ్యతలు స్వీకరించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకుల విజయ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాణి రుద్రమ, బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు శ్రీ పన్నాల హరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోర్చా అధ్యక్షురాలిగా ఎన్నికైన శిల్పాను సన్మానించి అభినందించారు.
అర్బన్ జిల్లా అధ్యక్షురాలిగా..
అలాగే బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్. ప్రకాష్ రెడ్డి, పార్టీ నాయకులు అయోధ్యలో రామ మందిర నిర్మాణం, ప్రాణ ప్రతిష్ట అయిన సందర్భంగా టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఇక మేడ్చల్ అర్బన్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పనిచేసిన ఆమె.. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గాపొల్గొంటూ నిరంతరం ప్రజల్లో ఉంటున్నారని పార్టీ శ్రేణులు తెలిపారు.
ఇది కూడా చదవండి :TSRTC: హే రేవంత్.. యే క్యా హువా! బస్సుల్లో మహిళలు ఈ పనులు కూడా చేస్తున్నారే!
శ్రీదా చిల్డ్రన్స్ హాస్పిటల్..
ఉప్పల్‌లో పుట్టి పెరిగిన ఆమె.. శ్రీదా చిల్డ్రన్స్ హాస్పిటల్‌ను ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి జనాల్లో మంచి గుర్తింపు సంపాదించింది. ఇప్పటికీ నవజాత శిశువులు, చిన్న పిల్లలు, యువకులకు ప్రత్యేకంగా సేవలను అందిస్తుంది.
బండి సంజయ్ ప్రేరణ..
చిన్నప్పటి నుంచి సేవాతత్పరత ఉన్న శిల్పా రెడ్డి ప్రజలకు అన్ని సేవలను అందించాలని ఆకాంక్షించారు. భారతీయ జనతా పార్టీ నాయకుడు బండి సంజయ్ కుమార్ నుంచి ప్రేరణ పొందిన శిల్పా రెడ్డి.. 2020 నవంబర్ 21న అధికారికంగా రాజకీయ నాయకురాలిగా మారిపోయారు. ఆమె పార్టీ పట్ల మంచి ఆసక్తిని కనబరుస్తుంది. ప్రతి కార్యకలాపాల్లోనూ చురుగ్గా పాల్గొంటుంది. ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా, పార్టీ ప్రచార ప్రయోజనాల కోసం తన బాధ్యతలను నిర్వహిస్తుందని పార్టీ శ్రేణులు చెబుతున్నారు.