Meghalaya: మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత!

మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి సాల్సెంగ్‌ . సి. మారక్‌ (82) శుక్రవారం కన్నుమూశారు.వృద్దాప్య సమస్యలతో బాధపడుతూ..తురా సివిల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.మాజీ ముఖ్యమంత్రి మృతికి నివాళులర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది.

New Update
Meghalaya: మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత!

Meghalaya: మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి సాల్సెంగ్‌ . సి. మారక్‌ (82) శుక్రవారం కన్నుమూశారు. ఈ సీనియర్‌ కాంగ్రెస్ నాయకుడు వృద్దాప్య సమస్యలతో బాధపడుతూ..తురా సివిల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సాల్సెంగ్ రెండు సార్లు ముఖ్యమంత్రి పదవిని నిర్వహించారు.

1993లో ఐదు సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నప్పుడు మొదటి ముఖ్యమంత్రిగా... 1998లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని సంకీర్ణం కుప్పకూలినప్పుడు 12 రోజుల ముఖ్యమంత్రి పదవిని కూడా నిర్వహించారు. 2003లో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌గా కూడా చేశారు. మాజీ ముఖ్యమంత్రి మృతికి నివాళులర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది.

మారక్ మృతి పట్ల ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా సంతాపం ప్రకటించారు. “మాజీ సీఎం సాల్సెంగ్ సీ మారక్ మరణవార్త తెలిసి చాలా బాధపడ్డాను. మేఘాలయ అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబసభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.” అని ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కూడా మారక్ మృతికి సంతాపం తెలిపారు.

Also Read:  ఉదయ్‌పూర్ లో 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు బంద్‌..ఎందుకంటే!

Advertisment
తాజా కథనాలు