Megha Scam: మేనమామకు వెన్నుపోటు.. మేఘా కృష్ణారెడ్డి ఖతర్నాక్‌ స్కెచ్‌..

కాళేశ్వరం ప్రాజెక్టులో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవినీతితో పాటూ సంస్థలో అంతర్గ విభేధాలు కూడా బయటపడుతున్నాయి.ఈ సంస్థ పెట్టిన కృష్ణారెడ్డి మేనమామ పీపీరెడ్డిని కంపెనీ నుంచి బయటకు పంపిచేశారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆయనతో 14వేల కోట్ల ఒప్పందం చేసుకున్నారని వినికిడి.

Megha Scam: మేనమామకు వెన్నుపోటు.. మేఘా కృష్ణారెడ్డి ఖతర్నాక్‌ స్కెచ్‌..
New Update

Megha Engineering and Infrastructures Ltd:

మేఘా కంపెనీ బాగోతాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌కు సంబంధించిన మోసాల చిట్టా బయటపడుతోంది. తెలంగాణ ప్రాజెక్టుల్లో అవినీతి బాగోతం బయటపడ్డాక ఇప్పుడు సొంత కంపెనీలో ఉన్న గొడవల గురించి రచ్చ మొదలైంది. అసలు కంపెనీని ప్రారంభించి, తన రెక్కల కష్టంతో అభివృధ్ధి చేసిన వ్యక్తినే కంపెనీ నుంచి గెంటేశారని తెలుస్తోంది. ఆ దారుణానికి బలయింది మరెవరో కాదు కృష్ణారెడ్డి సొంత మేనమామ పీపీ రెడ్డి.

పీపీ లేకుంటే మేఘా కంపెనే లేదు

మేఘా సంస్థకు కృష్ణారెడ్డి మేనేజింగ్ డైరెక్టర్, అయితే అతని మేనమామ పీపీరెడ్డి మెజారిటీ పార్టనర్. అసలు ఈ సంస్థను మొదలు పెట్టిందే ఆయన. ఈయన పూర్తి పేరు పామిరెడ్డి పిచ్చిరెడ్డి. 1989లో మేఘా ఇంజినీరింగ్ ఎంటర్‌ప్రైజెస్‌ను పీపీరెడ్డి ప్రారంభించారు. అప్పట్లో చిన్న పట్టణాల్లో పైపుల నిర్మాణాలను మేఘా కంపెనీ చేపట్టేది. తరువాత ఈయన మేనల్లుడు కృష్ణారెడ్డి… పీపీ రెడ్డితో జాయిన్ అయ్యారు. నెమ్మదిగా వ్యాపారాలు విస్తరించాయి. రోడ్ల నిర్మాణం, డ్యామ్స్, సహజ వాయువు, విద్యుత్, ఎలక్ట్రిక్ వాహనాలు, మెగా ఇంజనీరింగ్ వర్క్స్ వంటి అనేక ఇతర రంగాల్లోకి విస్తరించారు. 2006లో మేఘా ఇంజనీరింగ్ ఎంటర్‌ప్రైజెస్ పేరును.. ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌గా మార్చారు. మనదేశంలో 16 రాష్ట్రాల్లో ఈ కంపెనీ వ్యాపారాలు విస్తరించి వున్నాయి. అంతేకాక మరో10 దేశాల్లో కూడా వీరి కంపెనీలు ఉన్నాయి.

Also Read:కేసీఆర్‌ను నిండా ముంచిన కృష్ణారెడ్డి.. గులాబీ బాస్‌ చెవిలో ‘మేఘా’ క్యాబేజీ!

ఈ స్థాయికి ఎదిగిన మేఘా కంపెనీకి అసలు మూల పురుషుడు పీపీరెడ్డి. ఈయనే లేకపోతే ఈ కంపెనీయే ఉండదన్న మాట వాస్తవం. కృష్ణారెడ్డి కన్నా ముందే మేఘా కంపెనీని విస్తరించారు పీపీరెడ్డి. రైతు బిడ్డగా పుట్టిన పీపీరెడ్డి చాలా కష్టపడి పైకొచ్చారు. మొన్నమొన్నటి వరకూ కూడా కంపెనీలో ఆయనదే మెజారిటీ వాటా. కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారు అయ్యాయి. సొంత మేనమామ, కంపెనీ భాగస్వామి అయిన పీపీరెడ్డిని కృష్ణారెడ్డి సంస్థ నుంచి బయటకు గెంటేశారని చెబుతున్నారు. మేనమామను దారుణంగా మోసం చేశారన్న వార్తలు బహిర్గతం అయ్యాయి.

మోసపోయిన పీపీ రెడ్డి

దీనికి సంబంధించి పూర్తి వివరాలు బయటకు రాకపోయినా…కృష్ణారెడ్డి చేతిలో పీపీరెడ్డి దారుణంగా మోసపోయారని అంటున్నారు. అసలు ఆయనకి చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా కంపెనీ నుంచి గెంటేయాలని మొదట అనుకున్నారట. అయితే పీపీరెడ్డి ఊరుకోలేదు. కృష్ణారెడ్డి అక్రమాలపై అధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. దీంతో కృష్ణారెడ్డి తగ్గారని తెలుస్తోంది. తనను కంపెనీ నుంచి బయటకు పంపుతున్నందుకు నష్టపరిహారంగా పీపీరెడ్డి 35 వేల కోట్లు అడిగితే దానిని కృష్ణారెడ్డి 14 వేల కోట్లకు తెగ్గొట్టారని చెబుతున్నారు. ఆ మొత్తం మూడేళ్లలో ఇస్తానని మాట ఇచ్చారట. అయితే దీని మీద కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మోసానికి మారుపేరైన కృష్ణారెడ్డి మరోసారి తనను దగా చెయ్యడన్న నమ్మకం లేదని పీపీరెడ్డి అంటున్నట్టు సమాచారం.

కేసీఆర్‌ను మోసం చేసిన మేఘా

ఇక తెలంగాణ ప్రాజెక్టుల్లో వేల కోట్లు దోచుకున్న మేఘా కృష్ణారెడ్డి అవినీతి బాగోతాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోనే రూ.48 వేల కోట్లు కృష్ణారెడ్డి దోచుకున్నారని చెబుతున్నారు. అంతేకాదు నాసిరకం నిర్మాణాలు చేసి గత ప్రభుత్వాన్ని చిక్కుల్లో కూడా పడేశారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకతంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అప్రతిష్టపాలైందంటే ఆ పాపం ముమ్మాటికీ మేఘా సంస్థదే. కేసీఆర్‌కు మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకున్న మేఘా కృష్ణారెడ్డి తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాజెక్టుల్లో రూ.70 వేల కోట్లు దోచుకున్నాడని రిపోర్టులు చెబుతున్నాయి. కాగ్‌ రిపోర్ట్ సైతం మేఘా అవినీతి చిట్టాను బహిర్గతం చేసింది. ఈ ఒక్క రిపోర్ట్‌ చూస్తే చాలు మేఘా ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డాడో అర్థం చేసుకోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం విడుదల చేసి రూ.లక్షా 50 వేల కోట్లలో ఒక్క మేఘా కృష్ణారెడ్డే 48 వేల కోట్లు నొక్కేశాడని కాగ్‌ రిపోర్ట్ బయటపెట్టడం ఆయన అవినీతికి అద్దం పడుతోంది.

మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది అన్‌లిస్టెడ్ కంపెనీ. సెబీ పరిధిలోకి రాదు. ఇందులో తీసుకునే నిర్ణయాల చట్టబద్ధతకి ఎలాంటి గ్యారంటీ ఉండదు. మరి మామకిచ్చిన మాటకి కృష్ణారెడ్డి కట్టుబడి ఉంటాడా లేదా అన్న అనుమానం కంపెనీలోనే వ్యక్తమవుతోందట. పీపీ రెడ్డి కూడా ఇదే డౌట్‌ని సన్నిహితుల దగ్గర వ్యక్తం చేస్తున్నారట. మొత్తానికి కృష్ణారెడ్డి లీలలు అన్నీ ఒక్కొక్కటే రివీల్ అవుతున్నాయి. ఆయన మోసం చెయ్యాలి అనుకుంటే తన వాళ్లు , పరాయివాళ్లు అన్న భేదం కూడా ఉండదని అంతా అనుకుంటున్నారు.

Also Read: వారికి కాంగ్రెస్ షాక్.. వీరికే ఎమ్మెల్సీ టికెట్?

#kaleswaram #megha-krishna-reddy #megha-engineering-infrastructures-limited #krishna-reddy #pp-reddy #megha-scam
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe