Chiranjeevi-Ayodhya: ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలంటూ మెగాస్టార్‌కు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానం!

జనవరి 22న అయోధ్యలో జరగనున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వనించారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ద్వారా వచ్చిన ఆహ్వనాన్ని తెలంగాణ VHP జాయింట్ సెక్రటరీ రావినూతల శశిధర్, VHP నాయకులు మెగాస్టార్‌కు అందించారు.

New Update
Chiranjeevi-Ayodhya: ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలంటూ మెగాస్టార్‌కు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానం!

వందేళ్ల తర్వాత మళ్లీ అయోధ్య(Ayodhya)లో బలరాముడికి పట్టాభిషేకం చేసే సమయం ఆసన్నమైంది. జనవరి 22న రామమందిరంలో బలరాముడి ప్రాణప్రతిష్ఠకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓ వైపు రామలల్ల స్థాపనకు ఏర్పాట్లు పూర్తి అవుతుంటే మరోవైపు దేశవ్యాప్తంగా భక్తుల్లో ఉత్సాహం నెలకొంది. త్రేతాయుగ వైభవాన్ని మరోసారి చూసేందుకు యావత్ దేశం ఎదురుచూస్తోంది. అయోధ్య వెంటనే గుర్తుకు వచ్చేది శ్రీరామ మందిరమే. హిందువుల హృదయాల్లో నిత్యం నిలిచే అయోధ్యలోని శ్రీరామ మందిరంలో బలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశంలోని అతిరథులు వస్తున్నారు. ఇప్పటికే సచిన్‌, కోహ్లీతో పాటు పలువురు సినీ స్టార్స్‌కు ఆహ్వానం పంపిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తాజాగా మెగాస్టార్ చిరంజీవిని ప్రాణప్రతిష్ఠకు ఇన్‌వైట్ చేసింది.

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)కి జనవరి 22న అయోధ్యలో జరగనున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వనిస్తూ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ద్వారా వచ్చిన ఆహ్వనాన్ని తెలంగాణ VHP జాయింట్ సెక్రటరీ రావినూతల శశిధర్, VHP నాయకులు అందించారు.

ఎన్నో విశేషాలు:
రాముని విగ్రహాన్ని ప్రతిష్ఠపనకు మరింత వెలుగునిచ్చేందుకు అదే రోజున అయోధ్యలో భారీ దీపాన్ని వెలిగించనున్న విషయం తెలిసిందే. అయోధ్యలోని రామ్‌ఘాట్‌లోని తులసిబారి దగ్గర 28 మీటర్ల వ్యాసం కలిగిన దీపాన్ని వెలిగించనున్నారు. ఈ దీపాన్ని వెలిగించడానికి 21 క్వింటాళ్ళ నూనె పడుతుందని చెబుతున్నారు. ఈ దీపం పేరు దశరథ్ దీప్(Dasarath Deep). దీని తయారీలో చార్‌ధామ్‌తో పాటు పలు పుణ్యక్షేత్రాలలోని మట్టి, నదులు, సముద్ర జలాలను ఉపయోగిస్తున్నారు. తపస్వి కంటోన్మెంట్‌కు చెందిన స్వామి పరమహంస పలు గ్రంథాలు, పురాణాలను అధ్యయనం చేసి, త్రేతాయుగంనాటి దీపం ఆకారాన్ని సిద్ధం చేస్తున్నారు. దశరథ్ దీప్‌ను 108 మందితో కూడిన బృందం తయారు చేస్తున్నారు. ఈ దీపం తయారీకి ఏడున్నర కోట్ల రూపాయలు అవుతుందని చెబుతున్నారు. దీపాన్ని వెలిగించడానికి 1.25 క్వింటాళ్ల పత్తితో వత్తిని కూడా తయారు చేస్తున్నారు. ఇక ప్రపంచంలోనే అత్యంత పెద్ద దీపంగా దశరథ్ దీప్ రికార్డులకెక్కనుంది. అందుకే గిన్నిస్ బుక్(Guinness Book) ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఈ దీపం ఘనతను నమోదు చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read: అక్కడికి రాముడొక్కడే కాదు.. వేలాది కోట్ల పెట్టుబడులు కూడా

WATCH:

Advertisment
తాజా కథనాలు