Chiranjeevi : లండన్ వెకేషన్ లో మెగా ఫ్యామిలీ.. మనవరాలు క్లింకార ఫేస్ రివీల్ చేసిన చిరు..!

చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు బయలుదేరారు. తన భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, మనవరాలు క్లీంకారతో కలిసి లండన్‌లో విహరిస్తున్నారు. కుటుంబంతో కలిసి దిగిన ఫోటోను ఆయన ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ ఫొటోలో క్లింకారా ఫేస్ కొంచం కనిపించింది. ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది.

New Update
Chiranjeevi : లండన్ వెకేషన్ లో మెగా ఫ్యామిలీ.. మనవరాలు క్లింకార ఫేస్ రివీల్ చేసిన చిరు..!

Megastar Chiranjeevi Family : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకాగా విడుదల కానుంది. ఇదిలా ఉంటే చిరు షూటింగ్ కి గ్యాప్ ఇచ్చి తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు బయలుదేరి వెళ్లారు. తన భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, మనవరాలు క్లీంకారతో కలిసి లండన్‌లో విహరిస్తున్నారు.

Also Read : విజయ్ దేవరకొండతో వివాదం.. మరోసారి స్పందించిన అనసూయ, ఈసారి ఏం చెప్పిందంటే?

ఈ క్రమంలోనే ఓ పార్క్‌లో తన కుటుంబంతో కలిసి దిగిన ఫోటోను ఆయన ట్విటర్‌లో షేర్ చేశారు. ఒలింపిక్స్‌ ఆరంభ ఈవెంట్‌ కోసం పారిస్‌కు వెళ్తున్నట్లు తెలిపారు. రేపటిలోగా అక్కడికి చేరుకుంటామని వెల్లడించారు. తాజాగా లండన్‌లోని హైడ్ పార్క్‌లో కుటుంబంతో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో క్లింకారా ఫేస్ కొంచం కనిపించింది. దీంతో ఫ్యాన్స్ 'మెగా క్వీన్ లుక్ అదిరిపోయిందంటూ' ఈ పిక్ ను నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు