/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/chiru-2-jpg.webp)
Chiranjeevi 'Mega 156' Movie: చిరంజీవి 156వ సినిమా అప్డేట్ వచ్చేసింది. అందరూ అనుకున్నట్టుగానే కల్యాణ్ కృష్ణ సినిమాను మెగాస్టార్ చిరంజీవి పక్కనపెట్టారు. భోళాశంకర్ వంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి రెండు సినిమాలు లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఒకటి బంగార్రాజు ఫేమ్ కళ్యాణ్ కృష్ణతో,మరొకటి బింబిసార ఫేమ్ వశిష్ఠతో. మెగా 156గా కళ్యాణ్ కృష్ణతో రాగా.. మెగా 157గా వశిష్ఠ సినిమా రాబోతుందని ప్రచారం చేశారు. కానీ ఆ తర్వాత వశిష్ఠ (Vassishta) సినిమాకు సంబంధించి వరుసగా అప్డేట్స్, రకరకాల ఊహాగానాలు బయటకు వచ్చాయే తప్ప కల్యాణ్ కృష్ణ సినిమాకు సంబంధించి ఏమీ రాలేదు. దీంతో కల్యాణ్ కృష్ణ సినిమాను చిరు పక్కనపెట్టారనే ప్రచారం సాగింది. ఇప్పుడా ప్రచారమే నిజమైంది. దసరా పండగా సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు వంశీ తో మూవీ తీస్తున్న మేకర్స్. గ్రాఫిక్స్ తో చేసిన ఆయుధమున్న పోస్టర్ను విడుదల చేసింది.
Also Read:ఖమ్మం రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు.. పూటకో కండువా..రోజుకో పార్టీ!
మెగా 157 నెంబర్ను మెగా 156గా మార్చి విషయాన్ని క్లారిటీ ఇచ్చింది. అంటే భోళా శంకర్ తర్వాత ఇప్పుడు రానున్న సినిమా ఇదేనన్న మాట. భోళా శంకర్ డిజాస్టర్ కావడం, కథల సెలక్షన్స్ పై భారీగా విమర్శలు రావడంతో.. చిరు (Chiranjeevi) ఆత్మపరిశీలన చేసుకుని రీమేక్ కు నో చెప్పి.. ఫాంటసీకి షిఫ్ట్ అయిపోయారు. ఇకపోతే సినిమాకు సంబంధించి పాట రికార్డింగ్ తో పూజా కార్యక్రమాలు మొదలుపెట్టారని టాక్. ఎంఎం కీరవాణి (MM Keeravani) స్వరపరిచిన ఒక సాంగ్ ను రికార్డు చేసినట్టు సమాచారం అందింది. అయితే దీనికి సంబంధించి అధికారిక సమాచారం ఏమీ లేదు. ప్రస్తుతం వరుణ్ తేజ్ పెళ్ళి హడావుడిలో ఉంది మెగా ఫ్యామిలీ. అది అయ్యాక మూవీ షూటింగ్ మొదలుపెడతారని చెబుతున్నారు.
In the good old days, films used to begin with music compositions, and #Mega156 has brought the tradition back to Telugu Cinema 💫🔮
Beginning the MEGA MASS BEYOND UNIVERSE with a celebratory song composition followed by an auspicious Pooja Ceremony ❤️
Wishing everyone a very… pic.twitter.com/CRuG2f7fot
— UV Creations (@UV_Creations) October 24, 2023