Rana Daggubati: మెగాస్టార్ కు విలన్ గా రానా?
మెగాస్టార్‌తో తలపడే విలన్ గా రానా పేరు వినిపిస్తూ ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి తన 156వ సినిమాను శ్రీవశిష్ఠ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ రోజునే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమాలో కథానాయికల సంగతి అటుంచితే, ప్రతినాయకుడిగా ఎవరు కనిపించనున్నారనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో 'రానా' పేరు ఎక్కువుగా వినిపిస్తూ ఉండటం విశేషంగా మారింది.