/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-74.jpg)
Ram Charan : ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బాధితులకు ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం తన వంతు సాయంగా ." రూ. 50 లక్షల చొప్పున రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ. కోటి విరాళం ప్రకటించారు.
వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం తోడుగా, అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయం ఇది. నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు ( Rs.1 Crore) విరాళంగా ప్రకటిస్తున్నాను.
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి…
— Ram Charan (@AlwaysRamCharan) September 4, 2024
Also Read : తెలంగాణ వరద బాధితులకు ‘కల్కి’ నిర్మాతలు విరాళం..
ఈ విషయాన్ని తెలుపుతూ ఎక్స్ లో.." వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం తోడుగా.. అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయమిది. నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌లకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటిస్తున్నా. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నా" అని పోస్ట్ పెట్టారు.