Vyjayanthi Movies : ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బాధితులకు ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. వారిలో హీరోలతో పాటూ పలువురు నిర్మాతలు కూడా ఉన్నారు. ఇందులో భాగంగానే బాదితులకు సాయంగా ‘కల్కి 2898AD’ మేకర్స్ అయిన వైజయంతీ మూవీస్ రూ.25 లక్షలు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.
పూర్తిగా చదవండి..Vyjayanthi Movies : తెలంగాణ వరద బాధితులకు ‘కల్కి’ నిర్మాతలు విరాళం..
వైజయంతీ మూవీస్ సంస్థ వరద బాధితుల సహాయార్థం రూ.20 లక్షల విరాళాన్ని తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా దీని కంటే ముందు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు సైతం రూ.25 లక్షలు విరాళం ప్రకటించింది.
Translate this News: