AP Mega DSC : మెగా డీఎస్సీపై ఏపీ సర్కార్ కీలక జీఓ!

ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చినహామీ మేరకు.. తొలిసంతకం మెగా డీఎస్సీపై పెట్టారు. మొత్తం 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు బాబు ప్రకటించారు.

New Update
AP Mega DSC : మెగా డీఎస్సీపై ఏపీ సర్కార్ కీలక జీఓ!

AP Sarkar : ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు (Chandrababu) వెలగపూడి సచివాలయంలో గురువారం తన సర్కార్ ని కొలువుదీర్చారు. మొదటి రోజే చంద్రబాబు పలు కీలక నిర్ణయాలను అమలు చేసేందుకు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చినహామీ మేరకు.. తొలిసంతకం మెగా డీఎస్సీ పై పెట్టారు. మొత్తం 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ (Mega DSC Notification) ను త్వరలో విడుదల చేయనున్నట్లు బాబు ప్రకటించారు.

ఈ సందర్భంగా గత సర్కార్‌ వెలువరించిన పాత డీఎస్సీని బాబు సర్కార్‌ రద్దు చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం (AP Government) గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబరు 31 లోగా డీఎస్సీ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ఉత్వర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.

డీఎస్సీ ప్రకటన నుంచి పోస్టుల భర్తీ కి మొత్తం పనులను 6 నెలల్లోపే పూర్తి చేయనున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో నోటిఫికేషన్‌, దరఖాస్తు, పరీక్ష తేదీలు వివరాలు వెల్లడి కానున్నాయి. కాగా 2024 ఎన్నికల ముందు 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గత ప్రభుత్వం ప్రకటన ఇవ్వగా 4,72,487 మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఎన్నికల కోడ్‌ కారణంగా వాయిదా పడింది.

మొత్తం ఖాళీలు 16,347
సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్‌జీటీ) పోస్టులు: 6,371
పీఈటీ పోస్టులు: 132
స్కూల్‌ అసిస్టెంట్స్‌ పోస్టులు: 7725
టీజీటీ పోస్టులు: 1781
పీజీటీ పోస్టులు: 286
ప్రిన్సిపల్స్‌ పోస్టులు: 52గా అధికారులు వివరించారు.

Also read: లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జూన్‌ 26 నే!

Advertisment
తాజా కథనాలు