Niharika : ఈ పోస్ట్‌ కి అర్థం ఏంటి.. నిహారిక మళ్లీ ప్రేమలో పడిందా?

మెగా డాటర్‌ నిహారిక తాజాగా పెట్టిన ఓ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.ఆ పోస్ట్ లో రెండు ఏనుగులు వాటి ముఖాల్ని దగ్గరకు పెట్టి ప్రేమగా ఉన్నాయి. దీనిని చూసిన వారంతా కూడా నిహారిక మళ్లీ ప్రేమలో పడిందని అందుకే ఇలాంటి పోస్టులు పెట్టి హింట్లు ఇస్తుందని అనుకుంటున్నారు.

New Update
Niharika : ఈ పోస్ట్‌ కి అర్థం ఏంటి.. నిహారిక మళ్లీ ప్రేమలో పడిందా?

Niharika Fall In Love : మెగా ఆడపడుచు నిహారిక(Niharika) గురించి ఇండస్ట్రీకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. మెగా ఇంటి ముద్దుల డాటర్‌ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.హీరోయిన్‌(Heroine) గా ట్రై చేసినా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దాంతో ప్రొడక్షన్‌ డిపార్ట్ మెంట్‌(Production Department) మీద దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే పెళ్లి , విడాకులు ఇలా ఒక్కసారిగా నిహారిక లైఫ్‌ లోకి వచ్చేసాయి.

దాని తరువాత ఆమె హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఓ వంటల ప్రొగ్రాం కి యాంకర్‌ గా వ్యవహరిస్తుంది. ఇలా ప్రస్తుతం నిహారిక బిజీబిజీగా అయిపోయింది. ఈ క్రమంలోనే నిహరిక తాజాగా పెట్టిన ఓ పోస్ట్‌ సోషల్‌ మీడియా(Social Media) లో వైరల్‌ గా మారింది. ఆ పోస్ట్ లో రెండు ఏనుగులు వాటి ముఖాల్ని దగ్గరకు పెట్టి ప్రేమగా ఉన్నాయి. అక్కడితో ఆగకుండా ఓ రెడ్‌ హర్ట్ సింబల్‌ ని పోస్ట్‌ చేసింది.

దీనిని చూసిన వారంతా కూడా నిహారిక మళ్లీ ప్రేమలో పడిందని అందుకే ఇలాంటి పోస్టులు పెట్టి హింట్లు ఇస్తుందని ఇండస్ట్రీతో పాటు మెగా అభిమానులు కూడా చర్చించుకుంటున్నారు.

Also read: అవును మేమిద్దరం విడిపోతున్నాం.. స్టార్‌ హీరో అధికారిక ప్రకటన!

#viral #mega-daughter #fall-in-love #niharika #Social Media
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు