/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/upasana-1-jpg.webp)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) మెగాస్టార్ తనయునిగా సినీ ప్రపంచానికి పరిచయం అయినప్పటికీ..నటనలో తండ్రిని మించిన తనయుడు అంటూ పేరు తెచ్చుకున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్ (RRR) సినిమా తరువాత చరణ్ రేంజే మారిపోయిందని చెప్పవచ్చు. ఇప్పటికే చరణ్ ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు.
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాని అంతర్జాతీయంగా విడుదల చేసి గ్లోబల్ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. చరణ్ కెరీర్ ప్రారంభంలో ఉండగానే ఉపాసన (Upasana) కామినేనిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఉపాసన మెగా కోడలిగానే కాకుండా..సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకంటూ ప్రత్యేకమైన పేరును సంపాదించుకుంది.
పెళ్లైన 11 సంవత్సరాలకు చరణ్, ఉపాసన దంపతులకు పాప పుట్టింది. తనకి క్లీంకార అనే పేరు కూడా పెట్టారు. ఇప్పుడు ఈ జంట మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. వీరిద్దరూ ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీ (Forbes Cover Page) పై మెరిశారు. ఇప్పటి వరకు ఏ టాలీవుడ్ జంట కూడా ఇలా ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీ పై కనపడలేదు.
ఈ గౌరవాన్ని పొందిన మొదటి జంట చరణ్ ఉపాసనలదే. కవర్ పేజీ పై చరణ్, ఉపాసన చాలా స్టైలీష్ గా కనిపించారు. నిన్న కాక మొన్న పెళ్లి అయిన యువజంటలా కనిపించారు. ఈ క్రమంలోనే చరణ్ ఉపాసనలు..తమ ప్రేమ కథ, వైవాహిక జీవితం, క్లీంకార వారి జీవితంలోకి వచ్చిన తరువాత ఎలాంటి మార్పులు జరిగాయి అనే విషయాలను వారిద్దరూ ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఫోర్బ్స్ మ్యాగజైన్ పై తమ అభిమాన నటుడు తన భార్యతో కలిసి ఉన్న చిత్రం రావడంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Forbes magazine recent edition features @AlwaysRamCharan & @upasanakonidela 🩷#ManOfMassesRamCharan #RamCharan #GameChanger pic.twitter.com/QI5NFMOdIN
— Trends RamCharan ™ (@TweetRamCharan) December 22, 2023
Also read: రైతుబంధుపై కొత్త రూల్స్ ఇవే.. అలాంటి భూములకే సాయం?