Agni-5 Missile: మిషన్ దివ్యాస్త్ర వెనుక హైదరాబాద్ మహిళా శాస్త్రవేత్త

భారత్ ప్రయోగించిన అగ్ని-5 ఖండాంతర క్షిపణి దివ్యాస్త్ర సూపర్ సక్సెస్ అయింది. ఈ ఖండాంతర క్షిపణి.. అణ్వస్త్రాన్నీ మోసుకెళ్లగలదు. అయితే దీని వెనుక హైదరాబాద్ శాస్త్రవేత్త ఉన్నారని మీకు తెలుసా..అది కూడా మహిళాశక్తి అనే విషయం తెలుసా...అయితే ఇది చదివేయండి.

New Update
Agni-5 Missile: మిషన్ దివ్యాస్త్ర వెనుక హైదరాబాద్ మహిళా శాస్త్రవేత్త

Scientist Sheena Rani: మిషన్ దివ్యాస్త్రలో ప్రాజెక్టులో భాగంగా బహుళ వార్‌హెడ్లను తీసుకెళ్ళే అగ్ని-5 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని సోమవారం ఒడిశా నుంచి ప్రయోగించారు. ఈ ప్రయోగం సూపర్ సక్సె అయింది. అయితే ఈ మొత్తం ప్రాజెక్టును ముందుండి నడిపించింది ఓ మహిళ. అది కూడా ఓ హైదరాబాదీ మహిళ. ఇక్కడ డీఆర్డీవోకు చెందిన శాస్త్రవేత్త షీనారాణి అగ్ని-5కు (Agni-5 Missile) నాయకత్వం వహించారు.

షీనారాణి హైదరాబాద్‌లోని డీఆర్డీఓకి చెందిన అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లాబొరేటరీ శాస్త్రవేత్తగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎలక్ట్రానిక్స్‌ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌‌లో డిగ్రీ పూర్తిచేశారు.ఆమెకు కంప్యూటర్‌ సైన్స్‌లో కూడా ప్రావీణ్యం ఉంది. మొదట ఎనిమిదేళ్ళు విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌సెంటర్‌ (VSSC)లో శాస్త్రవేత్తగా పనిచేసిన షీనా.. 1998 నాటి పోఖ్రాన్ అణు పరీక్షల తర్వాత 1999లో డీఆర్డీఓలోకి మారారు. అప్పటి నుంచి ఆమె ‘అగ్ని’ రకం క్షిపణులకు సంబంధించి అన్ని శ్రేణుల లాంచ్‌ కంట్రోల్‌ సిస్టమ్స్‌పైనా పనిచేస్తున్నారు. 57 ఏళ్ళ షీనారాణి DRDO యొక్క ఏస్ ల్యాబ్ ASLకి అసోసియేట్ డైరెక్టర్ కూడా. ఈమెను మిస్సైల్ రాణి అని పిలుస్తారు. షీనాకు స్ఫూర్తి అబ్దుల్ కలాం, డీఆర్డీవో మాజీ ఛీఫ్ డాక్టర్ అవినాష్ చందర్‌లు.

మిషన్ దివ్యాస్త్రలో భాగంఅయిన అగ్ని-5 ను హైదరాబాద్‌లో డీఆరండీవో మిసైల్ కాంప్లెక్స్‌లోనే తయారు చేశారు. ఇందులో షీనారాణితో పాటూ మరికొందరు మహిళా శాస్త్రవేత్తలు కూడా పాల్గొన్నారు. అణ్వాశ్ర్తాన్ని మోసుకెళ్ళగలిగే అగ్ని-5...5000 కి,మీ దూరాన్ని చేరుకోగలవు. ప్రధానంగా చైనా నుంచి ఎదురయ్యే మోప్పును తిప్పి కొట్టేందుకు భారత్ దీన్ని తయారు చేసింది.

ప్రస్తుతం తయారు చేసిన అగ్ని-5 క్షిపణి కార్యక్రమంలో భాగమైనందుకు శాస్త్రవేత్త షీనారాణి చాలా సంతోషం వ్యక్తం చేశారు. దేశ సరిహద్దులను క్షిపణులు రక్షిస్తున్నందున అగ్ని క్షిపణి కార్యక్రమంలో భాగమైనందుకు నేను నిజంగా గర్వపడుతున్నాను’ అని షీనా అన్నారు. పదేళ్ళ వయసులో తండ్రిని కోల్పోయిన షీనా..తల్లి సంరక్షణలోనే పెరిగారు. తాను ఈ స్థితికి చేరుకోవడానికి తన తల్లే కారణమని చెబుతున్నారు.

Also Read:Pizza: తియ్యతియ్యగా గులాబ్‌జామ్ పిజ్జా..వైరల్ అవుతున్న వీడియో

Advertisment
తాజా కథనాలు