బాహుబలిని చూడటమే కాదు.. తినటం కష్టమే

బాహుబలి సినిమా అందరూ థియోటర్‌కి వెళ్లి 100 నుంచి 500 వరకు డబ్బులు ఖర్చు పెట్టి ఒకటి, రెండు సార్లు చూసే ఉంటారు. కానీ ఇప్పుడు బాహుబలి చూడాలన్న, తినాలన్న యూపీకి వెళ్లి రావాలి. ఎందుకంటే అక్కడ రూ.1500 ధర కలిగిన బాహుబలి సమోసా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదేంటో ఓ లుక్కేద్దాం పదండి.

New Update
బాహుబలిని చూడటమే కాదు.. తినటం కష్టమే

Baahubali Samosa is viral in UP

ఏవరైనా పుట్టినరోజు వచ్చిందంటే ఎవరైనా కేక్‌, ముచ్చకాయ, ఇంకేదైనా కట్‌ చేస్తారు. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో కొందరు 12 కిలోల బాహుబలి సమోసా కట్‌ చేస్తున్నారు. స్థానిక లాల్‌కుర్తీ ప్రాంతానికి చెందిన కౌశల్‌ స్వీట్స్‌ మూడోతరం యజమాని శుభమ్‌ కౌశల్‌.. తమ దుకాణంలోని సమోసాలకు గుర్తింపు వచ్చేలా ఏదైనా చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా మొదట 4 కిలోలు.. తర్వాత 8 కిలోల సమోసాలు తయారు చేయించారు. వీటికి ప్రజాదరణ బాగుండటంతో ఈ సారి 12 కిలోల సమోసా తయారైంది.

30 నిమిషాల్లో 71 వేల నగదు మీవే..!

ఈ బాహుబలి సమోసాను ముగ్గురు వంట మనుషులు 6 గంటలు కష్టపడి దానిని తయారు చేశారు. ఈ సమోసాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఆర్డర్లు కూడా బాగానే వస్తున్నాయి. ఈ బాహుబలి సమోసాకి రూ.1500 ధరగా నిర్ణయించిన 12 కిలోల సమోసాలకు ఇప్పటివరకు దాదాపు 40 నుంచి 50 పుట్టినరోజు ఆర్డర్లు వచ్చాయని కౌశల్‌ తెలిపారు. అంతేకాదు.. ఈ సమోసాను 30 నిమిషాల్లో ఆరగిస్తే రూ.71 వేల నగదు మీదే అంటూ ఈయన బహుమతి కూడా పెట్టారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు