పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హట్ టాపిక్‌గా మారాయి. గురువారం లోక్ సభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆమె విపక్ష అధికారులనుద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు.
ఆమె బిల్లు గురించి ప్రసగింస్తున్న సమయంలో విపక్ష సభ్యులు ఆమె ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో మంత్రి మీనాక్షి లేఖి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ఒక నిమిషం మీరు నా మాటలు వినాలని, శాంతంగా ఉండాలని, లేదంటే ఈడీ మీ ఇంటికి వస్తుందని మంత్రి మీనాక్షి హెచ్చరించారు.
ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై లోక్ సభలో చర్చ జరిగిన సమయంలో మీనాక్షి ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లు’పై లోక్‌సభలో చర్చ జరుగుతుండగా.. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. అధికార పక్ష సభ్యులు మాట్లాడుతుండగా విపక్ష ఎంపీలు గట్టిగట్టిగా నినాదాలు చేశారు.
దీనిపై మీనాక్షి లేఖి స్పందిస్తూ.. ‘‘నిశ్శబ్దంగా ఉండండి. లేదంటే మీ ఇళ్లకు ఈడీ అధికారులు రావాల్సి ఉంటుంది’’ అని హెచ్చరించారు. అనంతరం ఈ బిల్లును సమర్థిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై పరోక్షంగా లేఖి ఘాటు విమర్శలు చేశారు. ఆయన ‘పావు వంతు సీఎం’ అని కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.