CM Revanth Reddy : మేడారం భక్తులకు శుభవార్త చెప్పిన సీఎం..ఆ సదుపాయం కల్పించిన సర్కార్..!!

మేడార భక్తులకు శుభవార్త చెప్పింది సర్కార్. మేడారం వెళ్లలేని భక్తులు ఉన్నచోటనే మొక్కులు చెల్లించుకునేలా ప్రాన్ చేసింది. ఆన్ లైన్ లో గద్దెల వద్దకు ఎత్తు బంగారాన్ని సమర్పించే సదుపాయాన్ని కల్పించింది. ఆన్ లైన్ లో డబ్బులు చెల్లిస్తే ఎత్తు బంగారాన్ని సమర్పించవచ్చు.

CM Revanth Reddy : మేడారం భక్తులకు శుభవార్త చెప్పిన సీఎం..ఆ సదుపాయం కల్పించిన సర్కార్..!!
New Update

Online Bangaram offering to Sammakka-Saralamma : మేడారం వెళ్లాలనుకుంటున్నారా? రద్దీ బాగుంటుందని భయపడుతున్నారా? అయితే మీకోసం సర్కార్ ఓ శుభవార్త చెప్పింది. అదేంటో తెలుసుకుందాం.

తెలంగాణ మినీ కుంభమేళాగా (Telangana Mini Kumbh Mela) పేరు తెచ్చుకున్న మేడారం జాతర...వనదేవతలైన సమ్మక్క సారలక్కను (Medaram Sammakka Sarakka) దర్శంచుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఈ జాతర ప్రతి రెండేళ్లకు ఒకసారి ఎంతో ఘనంగా జరుగుతుంది. ఈ పండగను దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. ఈ ఏడాది జాతర తేదీలను ఇప్పటికే ప్రకటించారు. 2024 ఫిబ్రవరి నెలలో మేడారం జాతర ఎంతో ఘనంగా జరుగుతుంది. 4 రోజుల పాటు సాగే ఈ ఉత్సవానికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ ఏడాది భారీ సంఖ్యలో భక్తులు మేడారంకు తరలివచ్చే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: పీవీకి భారతరత్న…తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం..!!

వనదేవతల జాతరకు సమయం దగ్గర పడింది. మరో రెండు వారాల్లోనే గిరిజన జాతర షురూ కానుంది. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీగా ఉండి ఇబ్బందులు ఎదురవుతాయని ఉద్దేశంతో చాలా మంది ముందుగానే మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇంకొంతమంది భక్తులు జాతర సమయంలోనే మొక్కులు చెల్లించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే జాతర సమయంలో మేడారం పరిసర ప్రాంతాల్లో భక్తజనంతో కిటకిటలాడుతుంది. ఎటూ చూసిన కాలు తీసి కాలు పెట్టనంత జనం ఉంటారు.

ఈ నేపథ్యంలో ఏవైనా కారణాల వల్ల కానీ...భారీగా రద్దీగా ఉండటంతో అక్కడికి వెళ్లేందుకు వీలుకానీ వారికి తెలంగాణ ప్రభుత్వం కొత్త సదుపాయాన్ని కల్పించింది. మేడారం (Medaram) వెళ్లలేని భక్తులు ఉన్న చోటు నుంచే మొక్కులు చెల్లించుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది సర్కార్. ఆన్ లైన్లో గద్దెల వద్దకు ఎత్తు బంగారాన్ని సమర్పించే అవకాశాన్ని కల్పించింది. ఆన్ లైన్లో డబ్బు చెల్లిస్తే చాలుసమ్మక్క సారలక్క గద్దెల వద్దకు ఎత్తు బంగారాన్ని సమర్పించుకోవచ్చు. కిలో ఎత్తు బంగారానికి రూ. 60 చొప్పున చెల్లిస్తే ప్రబుత్వమే సంబంధిత వ్యక్తుల పేరును బెల్లాన్ని సమ్మక్క గద్దెలకు చేరవేస్తుంది. ఎత్తు బంగారానికి అయ్యే ఛార్జీలతో పాటు పోస్టల్ ఛార్జీలు కూడా చెల్లిస్తే కొంత బెల్లాన్ని ప్రసాదం రూపంలో ఇంటికి పంపించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

ఇది కూడా చదవండి:  రైతుల పాలిట దేవుడు.. ఎన్నడూ ఓడిపోని వీరుడు.. భారతరత్న చౌదరి చరణ్‌ సింగ్‌!

#medaram-jathara #medaram-jathara-2024 #cm-revanth-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe