Mynampalli: మైనంపల్లి చేరికతో కాంగ్రెస్ లో చిచ్చు.. కీలక నేత ఔట్! మెదక్ అసెంబ్లీ కాంగ్రెస్ టికెట్ ను మైనంపల్లి హన్మంతరావు కుమారుడు రోహిత్ కు ఇస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. కష్టపడి పని చేసిన వారికి పార్టీలో గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. By Nikhil 01 Oct 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మైనంపల్లి హన్మంతరావు (Mynampalli Hanmanthrao), ఆయన కుమారుడు రోహిత్ (Mynampalli Rohith) ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. మైనంపల్లికి మల్కాజ్ గిరి టికెట్ పై హమీ లభించగా.. రోహిత్ కు మెదక్ టికెట్ కన్ఫామ్ అయినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా స్థానంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తూ పని చేసుకున్న వారు భగ్గుమంటున్నారు. ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడ్డ తమను పక్కకుపెట్టి కొత్తగా వచ్చిన వారికి అవకాశం కల్పించడం ఏంటని ఆశిస్తున్నారు. తాజాగా మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి రోహిత్ రాకను నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యత్వానికి, తన పదవికి రాజీనామా చేశారు. మైనంపల్లిని చేర్చుకోవడం ద్వారా పార్టీ కోసం ఇన్ని రోజులూ కష్టపడి పని చేసిన తనలాంటి వారికి గుర్తింపు లేదన్న విషయం అర్థమైందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం డబ్బే ప్రాతిపదికగా టికెట్లు ఇస్తూ.. కాంగ్రెస్ పార్టీ కోసం తన లాంటి వాళ్లు చేసిన సేవలు, త్యాగాలు, పడ్డ కష్టాలు గుర్తించకపోవడం వేదనకు గురి చేసిందన్నారు. ఇది కూడా చదవండి: MLC Kasireddy: బీఆర్ఎస్ కు షాక్… ఎమ్మెల్సీ కసిరెడ్డి రాజీనామా..!! ఇదిలా ఉంటే.. తిరుపతి రెడ్డి రాజీనామాతో తమ నేతకు లైన్ క్లీయర్ అయినట్లేనే మైనంపల్లి వర్గీయులు భావిస్తున్నారు. దీంతో మెదక్ టికెట్ తనకు దక్కడం ఖాయమేనని మైనంపల్లి రోహిత్ ధీమా వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం #brs #congress-party #mynampally-hanmanth-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి