Paris Olympics: ఒలింపిక్స్ చిహ్నం వెనుక రంగుల కథేంటో తెలుసా..

ఒలింపిక్స్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఐదు రంగుల రింగులు. 1896లో ఒలింపిక్స్ మొదలైన దగ్గర నుంచి ఉపయోగిస్తున్న ఈ చిహ్నం వెనుక అర్ధం ఏంటి? దీనిలో ఐదు రంగు ఎందుకు ఉయోగిస్తారో తెలుసా...

New Update
Paris Olympics 2024 : ఒలింపిక్స్ కోసం 417 కోట్లు ఖర్చు..

Olympics symbol:పారిస్ ఒలిపింక్స్ ప్రారంభం అయిపోయాయి. రేపటి నుంచి భారత అథ్లెట్ల ప్రదర్శన కూడా స్టార్ట్ అయిపోతోంది. పదివేల మందికిపైగా అథ్లెట్లు తమ పతక కలను సాకారం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. ప్రపంచం మొత్తంలో ఒలిపింక్స్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 1896లో ఒలింపిక్స్‌ ప్రారంభమయ్యాయి. దీనికి ఐదు రంగులుండి ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్న చిహ్నాన్ని ఉపయగిస్తున్నారు. శతాబ్దంగా వినియోగిస్తున్న ఈ చిహ్నం వెనుక అర్ధం ఏంటో తెలుసా..

ఒలింపిక్స్ చిహ్నంలో అయిదు రింగులకు అయిదు ప్రత్యేక రంగులు ఉంటాయి. నీలం, పసుపు, నలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగులతో అయిదు రింగులు ఒకదానితో మరొకటి కలిసిపోయి ఉంటాయి. ఈ చిహ్నాన్ని ఒలింపిక్‌ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్‌ పియర్‌ డు కుబెర్టిన్ రూపొందించారు. ఇందులోని అయిదు రింగులు ప్రపంచంలోని అయిదు ప్రధాన ఖండాలకు ప్రతీక. ఆఫ్రికా, అమెరికా, ఆసియా, యూరప్‌, ఆస్ట్రేలియా ఖండాలకు ప్రతీకగా అయిదు రింగులను రూపొందించారు. మొత్తం చిహ్నంలో మనకు అయిదు రంగులే కనిపిస్తాయి కానీ తెలుపు రంగుతో కలిసి ఒలింపిక్‌ రంగులు ఆరు అన్నమాట. ఈ ఒలింపిక్‌ రింగులు ఎడమ నుంచి కుడికి అనుసంధానించబడి ఉంటాయి. నీలం, నలుపు, ఎరుపు రింగులు పైన... పసుపు, ఆకుపచ్చ వలయాలు దిగువన ఉన్నాయి. క్రీడా స్ఫూర్తికి ప్రతీకగా ఈ చిహ్నాన్ని తయారు చేశారు.

ప్రపంచ సమగ్రతను కాపాడే ఉద్దేశంతో ఒలింపిక్స్ చిహ్నాన్ని రూపొందించారు. ఒలింపిక్ రింగుల్లోని నీలం, పసుపు, నలుపు, ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు రంగులు ఒలింపిక్‌ విశ్వవ్యాప్తతను సూచిస్తుంది. ఒలింపిక్ చిహ్నం, జెండా, నినాదం, గీతం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

Also Read:Paris Olympics: రేపటి నుంచి పారిస్ ఒలింపిక్స్ షురూ.. భారత్ షెడ్యూల్ ఇదే

Advertisment
తాజా కథనాలు