Ayodhya Ram Mandir : అయోధ్య రామ మందిర వేడుకలకు ఆ దేశంలో అధికారులకు 2 గంటల ప్రత్యేక విరామం!

భారతీయ మూలాలు ఉన్న ఆఫ్రికాలోని మారిషస్‌ దేశం రామ మందిరం వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది.జనవరి 22, 2024 న అక్కడి అధికారులకు రెండు గంటల పాటు విరామం ఇవ్వాలని హిందూ సామాజిక -సాంస్కృతిక సంస్థలు చేసిన అభ్యర్థనను మారిషస్‌ ప్రభుత్వం అంగీకరించింది.

New Update
Viral News: హనీమూన్‌ అని చెప్పి అయోధ్యకు తీసుకెళ్లాడు..నాకు విడాకులు కావాలి!

Ayodhya : అయోధ్య(Ayodhya) రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ ప్రారంభోత్సవ వేడుకల కోసం యావత్ భారతదేశం(India) ఇప్పటి నుంచే ముస్తాబవుతోంది. అసలు యూపీ(UP), అయోధ్యలో అయితే ప్రత్యేకంగా చెప్పానవసరం లేదు. సంక్రాంతి(Sankranti) పండుగను మించిన పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) ముఖ్య అతిథిగా హాజరవుతున్న విషయం తెలిసిందే.

భారతదేశంలో మాత్రమే కాకుండా..

జనవరి 22 న భవ్య రామ మందిర ప్రారంభోత్సవానికి దేశ వ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచం నలుమూలాల నుంచి కూడా అతిథులు విచ్చేయుచున్నారు. ఈ సందడి కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ఎక్కువ హిందూ జనాభా ఉన్న , భారతీయ మూలాలు ఉన్న ఆఫ్రికాలోని మారిషస్‌ దేశం రామ మందిరం వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

అక్కడ ఉన్న హిందూ సమాజం నుంచి ఆ దేశ అధ్యక్షులకు వచ్చిన అభ్యర్థన మేరకు మారిషన్‌ ప్రధాని ప్రవింద్‌ జుగ్ నాథ్‌ మంత్రి మండలి శుక్రవారం ఓ ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేసింది. భారత దేశంలో రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించి ఓ ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంది.

రెండు గంటల పాటు విరామం...

జనవరి 22, 2024 న అక్కడి అధికారులకు రెండు గంటల పాటు విరామం ఇవ్వాలని హిందూ సామాజిక - సాంస్కృతిక సంస్థలు చేసిన అభ్యర్థనను మారిషస్‌ ప్రభుత్వం అంగీకరించింది. రామ మందిర ప్రతిష్ఠ కార్యక్రమం జరిగే సమయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రెండు గంటల పాటు అధికారులకు విరామం ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

మారిషస్‌(Mauritius) దేశంలో హిందూ మతం ప్రధానంగా ఉంది. అక్కడ సుమారు 48. 5 శాతం మంది హిందు మతాన్ని అనుసరిస్తున్నారు. మారిషస్‌ దేశం హిందువులు ఎక్కువగా ఉన్న దేశాల్లో మూడో స్థానంలో ఉంది. బ్రిటీష్‌ వారు ఉన్న సమయంలో భారత్ నుంచి చాలా మందిని మారిషస్‌ లో తోటల్లో పని చేసుకునేందుకు తీసుకుని వెళ్లే వారు.

దీంతో వారు అక్కడే స్థిరపడిపోవడంతో హిందూ జనాభా క్రమంగా పెరిగింది. భారత్ నుంచి ప్రధానంగా బీహార్, ఏపీ, తెలంగాణ , యూపీ, మధ్యప్రదేశ్‌ , జార్ఖండ్‌ , మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి మారిషస్‌ కు భారతీయులు వెళ్లారు.

Also read: దగ్గుతో బాధపడుతున్నారా..అయితే లవంగాలు దివ్యౌషధం..కేవలం 2 రోజులే!

Advertisment
Advertisment
తాజా కథనాలు