బర్రెలక్క ఓట్ల లెక్క తేల్చేసిన సర్వే.. టెన్సన్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్

తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన బర్రెలక్క (శిరీష)కు ఆరా మస్తాన్ సర్వే షాక్ ఇచ్చింది. ప్రజలనుంచి భారీ మద్ధతు లభించినప్పటికీ ఆమెకు 15 వేల ఓట్లు వస్తాయని చెప్పింది. ఆమె గెలవకపోయినా గట్టిపోటీ ఇస్తుందని, కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణరావు గెలిచే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

బర్రెలక్క ఓట్ల లెక్క తేల్చేసిన సర్వే.. టెన్సన్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్
New Update

ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ తమ రిజల్ట్స్ చెప్పేశాయి. అయితే కొల్లాపూర్‌ స్వతంత్ర్య అభ్యర్థి బర్రెలక్క (శిరీష) తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచనంగా మారిన సంగతి తెలిసిందే. కాగా బర్రెలక్కకు వచ్చే ఓట్లపై ఆసక్తికమైన చర్చ నడుస్తోంది. బర్రెలక్క విజయం సాధిస్తుందా. ఎన్ని ఓట్లు సొంతం చేసుకోగలిగిందనే విషయంపై ఆరా మస్తాన్ సర్వే ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ మేరకు బర్రెలక్కకు ప్రజలనుంచి భారీ మద్ధతు లభించినప్పటికీ ఓట్లు మాత్రం 15 వేల వరకూ రావొచ్చని అంచనా వేసింది. అయితే బర్రెలక్క గెలవకపోయినా గట్టిపోటీ ఇస్తారని స్పష్టం చేసింది. చివరగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కృష్ణరావు కొల్లాపూర్ లో గెలిచే అవకాశం ఉందని మస్తాన్ సర్వే వెల్లడించింది.

Also read :బీఆర్ఎస్ ఓటమి ఖాయం.. కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలకు సిద్ధం కండి: రేవంత్ రెడ్డి

నిరుద్యోగుల ప్రతినిధిగా బర్రెలక్క చేస్తున్న పోరాటానికి విద్యార్థులు, నిరుద్యోగుల నుంచి మద్దతు లభించింది. ఆమెను నిలువరించే వ్యూహం ఏంటో తెలియక ప్రధాన పార్టీలు తర్జనభర్జన పడ్డాయి. బర్రెలక్క పోటీపై బీఆర్‌ఎస్ మాత్రం నోరు విప్పలేదు. అయితే లోలోన తనకు మేలు జరుగుతుందనే విశ్లేషణలతో తెగ సంబరపడుతున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌ నేతలు మాత్రం తలలు పట్టుకుంటున్నారు. గత ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన జూపల్లికి బీజేపీ చీల్చిన ఓట్లతో పరాభవం ఎదురైంది. ప్రస్తుతం ప్రతిపక్ష కాంగ్రెస్‌ నుంచి పోటీచేస్తూ రేసులో ముందున్న జూపల్లికి బర్రెలక్క రూపంలో సవాల్‌ ఎదురవుతోంది. ఈ సవాల్‌ను జూపల్లి ఎలా అధిగమిస్తారనే ఉత్కంఠ పెరుగుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను బర్రెలక్క భారీగా చీల్చే అవకాశం ఉందని ఆందోళన చెందుతోంది కాంగ్రెస్. బర్రెలక్క సైతం ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తన పోరాటాన్ని మొదలు పెట్టినా ఇప్పుడు అదే అధికార బీఆర్ఎస్‌కు అడ్వాంటేజీగా మారనుందనే టాక్ నడుస్తోంది.

#barrelakka #votes #mastan-survey
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe