TS News: తెలంగాణలో భారీగా ఆర్డీవోల బదిలీ.!

తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ డివిజనల్ అధికారులను ప్రభుత్వం పెద్ద ఎత్తున బదిలీ చేసింది. 18మంది ఆర్డీవోలను బదిలీ చేస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

New Update
Telangana: యూనివర్సిటీ ఇంఛార్జి వీసీల పదవీకాలం పొడిగింపు

TS News:  తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ డివిజనల్ అధికారులను ప్రభుత్వం పెద్ద ఎత్తున బదిలీ చేసింది. 18మంది ఆర్డీవోలను బదిలీ చేస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. సంబంధిత జిల్లా కలెక్టర్లు వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా లేని పోస్టింగ్ లు ఉంటే వెంటనే ప్రభుత్వం ద్రుష్టికి తీసుకురావాలని కోరింది.

బదిలీ అయిన ఆర్డీవోల వివరాలు ఇవే.

1. పి. బెన్షాలోమ్‌ – యాదాద్రి భువనగిరి అడిషనల్‌ కలెక్టర్‌ ( రెవెన్యూ)
2. వి. భుజంగ రావు – నిర్మల్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌
3. జి.శ్రీనివాసరావు – మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్‌ ఆఫీసర్‌
4. బి.స్రవంతి – ఆర్మూర్‌ ఆర్డీవో
5. టి.వినోద్‌ కుమార్‌ – ఆదిలాబాద్‌ ఆర్డీవో
6. సిధమ్‌ దత్తు – వరంగల్‌ ఆర్డీవో
7. జీ.అంబదాస్‌ రాజేశ్వర్‌ – బోధన్‌ ఆర్డీవో
8. బి.రాజా గౌడ్‌ – విమెన్‌ & చైల్డ్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా సంక్షేమాధికారి
9. బి.చెన్నయ్య – జగిత్యాల స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌
10. సొక్కుల రమేశ్‌ బాబు – హుజూరాబాద్‌ ఆర్డీవో
11. వి.రామ్మూర్తి – హుస్నాబాద్‌ ఆర్డీవో
12. పి.సదానందం – సిద్దిపేట ఆర్డీవో
13. రమేశ్‌ రాథోడ్‌ – బాన్సువాడ ఆర్డీవో
14. కె.శంకర్‌ కుమార్‌ – హనుమకొండ స్పెషల్‌ కలెక్టర్‌ పీఏ
15. ఏ విజయ కుమారి – ఏటూరునాగారం స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌
16. బి.శకుంతల -సివిల్‌ సప్లై డిపార్ట్‌మెంట్‌
17. బి.గంగయ్య – పెద్దపల్లి ఆర్డీవో
18. సీహెచ్‌ మధుమోహన్‌ – వికారాబాద్‌ ఆర్డీవో

ఇది కూడా చదవండి: మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు 14రోజుల రిమాండ్.!

Advertisment
తాజా కథనాలు