Delhi : ఢిల్లీలోని ఘాజీపూర్‌లోని ప్రదేశంలో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. 10 అగ్నిమాపక వాహనాలు(Fire Engine) ఘటనా స్థలంలో మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యాయి. ఆదివారం సాయంత్రం ప్రారంభమైన ఈ మంటలు క్రమంగా భారీగా ఎగిసిపడుతున్నాయి. ఘాజీపూర్ ల్యాండ్‌ఫిల్ సైట్(Ghazipur Landfill Site) లో అగ్నిప్రమాదం జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఇక్కడ అనేక అగ్ని ప్రమాదాలు జరిగాయి. మునిసిపల్ కార్పొరేషన్ ద్వారా ఢిల్లీ చెత్తలో ఎక్కువ భాగం ఘాజీపూర్ ల్యాండ్‌ఫిల్ సైట్(Gలో డంప్ చేస్తుంటారు.
మంటలను...
అయితే, ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టానికి సంబంధించిన సమాచారం వెల్లడి కాలేదు. మంటలను ఆర్పే పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో మంటలు చెలరేగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు అగ్నిమాపక సిబ్బంది(Fire Fighters) కి సమాచారం ఇచ్చి మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలంలో గ్యాస్ ఏర్పడటంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఉండవచ్చని ఎంసీడీ అధికారులు భావిస్తున్నారు.
వేసవి కాలం(Summer Season) లో చెత్త ఎక్కువగా ఉన్నచోట అగ్నిప్రమాదానికి సంబంధించిన ప్రమాదాలు ఇప్పటికే చాలా వెలుగులోకి వచ్చాయి. గతేడాది కూడా ప్రాంతంలో పలుచోట్ల మంటలు చెలరేగాయి. ఈ చెత్తకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
Also read: గుండె జబ్బులకు ఎంతగానో మేలు చేసే అర్జున బెరడు..ఎలా తీసుకోవాలంటే!