Viral news: పెళ్ళి కోసం వాల్ పోస్టర్లు.. ఈ ఏపీ కుర్రోడు ఇంకా ఏం చేశాడో చూడండి! (వీడియో)

యుక్త వయస్సు దాటుతున్నా పెళ్ళి కాకపోవడంతో ఓ విన్నూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ఓ యువకుడు. తనను పెళ్ళి చేసుకోవాలనుకునే అమ్మాయిలు వారి పేర్లను నమోదు చేసుకోవాలంటూ ఏకంగా నడి రోడ్డుపై స్వయం వరానికి కౌంటర్‌ను ఏర్పాటు చేశాడు. ఇంతకీ ఎవరా యువకుడు తెలుకోవాలంటే బాపట్ల జిల్లాకు వెళ్ళాల్సిందే మరి.

New Update
Viral news: పెళ్ళి కోసం వాల్ పోస్టర్లు.. ఈ ఏపీ కుర్రోడు ఇంకా ఏం చేశాడో చూడండి! (వీడియో)

వివాహమనేది జీవితంలో అతిపెద్ద ముఖ్య ఘట్టం. ఈ విషయంలో బాగా ఆలోచించి స్టెప్ వేయాలని సూచిస్తూ ఉంటారు పెద్దలు. అయితే పాతకాలం రోజుల్లో పెళ్ళి అనేది పెద్దల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఓ వయస్సు వచ్చిన తర్వాత పెళ్ళి చేసుకోవటం మాములే.. అలాంటి పెళ్ళి జీవితంలోకి అడుగుపెట్టాలంటే చాలా విషయాలు ఆలోచించాలి. ఒకప్పుడు పెళ్లిళ్లు అంటే ముందు ఏడు తరాలు ఎనకెడు తరాలు చూసేవాళ్ళు. కానీ.. రాన్రాను కాలం మారింది. పెళ్లి చేసుకునే విషయంలో వల్లే స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎలాంటి భార్య కావాలని ఇది కూడా ముందుగానే నిర్ణయించుకుంటున్నారు. అయితే పెళ్ళి చేసుకునే విషయంతో ఓ యువకుడు తీసుకున్న నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఇది కూడా చదవండి: తెలంగాణలో రానుంది బీజేపీ ప్రభుత్వమే.. కేంద్ర మంత్రి బీఎల్ శర్మ

పెళ్ళికి వచ్చిన తిప్పలు

బాపట్ల జిల్లా వేటపాలెం మండల రామన్నపేటకు చెందిన దేవన నీలకంఠం అయ్యప్ప కుమార్ అనే యువకుడు డిగ్రీలో బీకాం చేశాడు. ఇతనికి యుక్త వయస్సు వచ్చినా.. పెళ్ళి కాక పోవడంతో తనంటే ఇష్టపడే అమ్మాయిలు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చీరాలలోని పలు ప్రాంతాల్లో సైకిల్‌పై తిరుగుతూ కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నాడు. తనను పెళ్ళి చేసుకోదలచిన వారు తమ పేరు, ఫోన్ నంబర్‌ను తన దగ్గర ఉన్న పుస్తకంలో రాయాలటున్నాడు. లేదా.. స్వయంగా తన ఇంటికి రావాలంటూ చెబుతున్నాడు. అయ్యప్పకుమార్ గతంలో కూడా ఇదే విధంగా వాల్ పోస్టర్లను అంటించి తన ఇంటి గోడలపై సైతం అమ్మాయిలు తనకు ఫోన్ చేయాలంటూ రాశాడు. దీనితో పోలీసులు అయ్యప్ప కుమార్‌ని అదుపులోకి తీసుకొని విచారించారు. అతనికి మతిస్థిమితం సరిగా లేదని తెలుసుకున్న పోలీసులు మందలించి పంపించారు. మరలా తాజాగా తనను పెళ్ళి చేసుకోవాలనుకున్న అమ్మాయిలు తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ ఏకంగా ఆహ్వాన పత్రికతో కౌంటర్లనే ఏర్పాటు చేశాడు.

ఇది కూడా చదవండి: అత్యాధునిక పరికరాలతో ఏటీఎం దొంగతనాలు.. ముఠా ఆట కట్టించిన తిరుపతి పోలీసులు

Advertisment
తాజా కథనాలు