Kothagudem district - Maoists Encounter: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తుపాకీ మోత మోగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. కాల్పుల నేపథ్యంలో సరిహద్దు జిల్లాల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసుల కాల్పుల్లో చనిపోయిన వారిలో పాల్వంచ - మణుగూరు- కరకగూడెం డీవీసీఎం లచ్చన్న (DVCM Lacchanna) హతమైనట్లు అధికారులు తెలిపారు.
పలు విధ్వంసకరమైన ఘటనల్లో మావోయిస్టు డీవీసీఎం లచ్చన్న కీలక పాత్ర పోషించాడు. మావోయిస్టు లచ్చన్న పై పలు పోలీస్ స్టేషన్లలో మొత్తం 50 కేసులు నమోదయ్యాయి. చర్ల ఏరియా కమాండర్ గా లచ్చన్న భార్య తులసి వ్యవహరిస్తుంది మావోయిస్టు లచ్చన్న స్వస్థలం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం రాయపాడు. లచ్చన్నపై పదిలక్షల రివార్డు కూడా ఉంది. ఈ ఆపరేషన్ ను విజయవంతంగా ముగించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రేహౌండ్స్ టీం. కాల్పుల్లో ఇద్దరు పోలీసులకు గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు.
జులై చివరిలో అడవి రామారంలోనూ కాల్పులు జరిగాయి. అప్పుడు జరిగిన ఎన్‌కౌంటర్ లో మావోయిస్టు యాక్షన్ టీం సభ్యుడు విజేందర్ హతమైన సంగతి తెలిసిందే. ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులు తెలంగాణలోకి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో మావోయిస్టులపై పోలీసులు నిఘా పెంచారు.
Also Read: మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్