Dandakaranyam: దండకారణ్యంలో దడ పుట్టిస్తున్న మావోయిస్టులు.. కాకీలపై సరికొత్త అస్త్రం!

భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ కు ధీటుగా మావోయిస్టులు సరికొత్త యుద్ధ తంత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. భద్రతా బలగాలను ఎదుర్కొనేందుకు స్నైపర్ జాకెట్ ను వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ జాకెట్ ప్రత్యేకలేంటో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి.

Dandakaranyam: దండకారణ్యంలో దడ పుట్టిస్తున్న మావోయిస్టులు.. కాకీలపై సరికొత్త అస్త్రం!
New Update

Chhattisgarh: భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ ను తిప్పికొట్టేందుకు మావోయిస్టులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. అడవిలో జల్లెడ పడుతున్న భద్రతాబలగాలను ధీటుగా ఎదుర్కునేందుకు సరికొత్త యుద్ధతంత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే దండకారణ్యంలో గెరిళ్లా దళాలకు వెన్నుదన్నుగా నిలిచేందుకు షార్ప్ షూటర్స్ ను తయారు చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం సుక్మా జిల్లా కంగల్టాంగ్ అటవీప్రాంతంలో మావోయిస్టు స్నైపర్ జాకెట్ ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కగార్ అపరేషన్ లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్ట్ డంప్ లో స్నైపర్ జాకెట్ లభ్యం కావడంతో ఒక్కసారిగా కంగుతిన్న అధికారులు.. వెంటనే భద్రతాబలగాలను అప్రమత్తం చేశారు. అలాగే భారత ప్రభుత్వం ప్రత్యేకంగా తయారు చేస్తున్న బుల్లెట్ ఫ్రూఫ్ స్నైపర్ జాకెట్లు మావోయిస్టులకు చేరడంపై కేంద్రహోంశాఖ ఆరాతీస్తోంది.

బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ ప్రత్యేకలేమిటి..
ఈ బులెట్ ప్రూఫ్ జాకెట్‌ ప్రత్యేకలేమిటంటే.. ఓ స్నైపర్ వరసగా 6 బుల్లెట్లు వచ్చి తాకినా ఆ వ్యక్తిని రక్షిస్తుంది. ఈ జాకెట్‌ ముందు భాగంలో ఉండే Hard Armour Panel (HAP), మోనోలిథిక్ సెరామిక్ ప్లేట్ (monolithic ceramic plate)తో పాటు పాలిమర్‌తో దీన్ని తయారు చేశారు. ఇది ధరించినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా డిజైన్ చేశారు. లైట్‌వెయిట్ బులెట్ ప్రూఫ్ జాకెట్‌ల తయారీ గురించి గతంలోనే కొందరు అధికారులు హింట్ ఇచ్చారు. ఉగ్రవాదులపై పోరాటం చేస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లోని హెలికాప్టర్ సిబ్బందికి ఈ బులెట్ ప్రూఫ్ జాకెట్‌లనే అందించనున్నారు. ఆపరేషన్స్‌లో పాల్గొన్న సమయంలో బరువైన జాకెట్స్‌ ఉండడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు గుర్తించారు. అందుకే వాటి బరువు తగ్గించి కొత్తగా వీటిని డిజైన్ చేశారు. ఆపరేషన్స్‌లో పాల్గొనే సమయంలో బులెట్ ప్రూఫ్ జాకెట్ బరువు 4 కిలోలకు మించి ఉండకూడదని IAF వెల్లడించింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని DRDO దీనిని రూపొందించింది.

#maoists #dandakaranyam #sniper-jacket
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe