Kaleshwaram Project: 'మేడిగడ్డ' ఘటనపై మావోయిస్టుల లేఖ.. సీఎం కేసీఆర్‌పై సీరియస్..

మేడిగడ్డ బ్యారేజీ ఘటనపై మావోయిస్టులు తీవ్రంగా స్పందించారు. సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఓ లేఖ విడుదల చేశారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి కేసీఆర్ కుటుంబమే కారణమని ఆరోపించారు. పెద్ద మొత్తంలో కమీషన్లు తీసుకుని నాసిరకంగా నిర్మించారన్నారు. నిర్మాణ సమయంలోనే పగుళ్లు ఏర్పడినా, బయటి ప్రపంచానికి తెలియనివ్వలేదన్నారు. ప్రజలను, ప్రజాసంఘాలను కూడా అడ్డుకున్నారని అన్నారు.

New Update
Kaleshwaram Project: 'మేడిగడ్డ' ఘటనపై మావోయిస్టుల లేఖ.. సీఎం కేసీఆర్‌పై సీరియస్..

Medigadda Lakshmi Barrage: మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు 30 మీటర్లు కుంగిపోవడానికి కారణం నాణ్యతా లోపమేనని మావోయిస్టులు(Maoist) పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) కుంగిన సంఘటనపై సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మావోయిస్టు జేఎమ్‌‌డబ్ల్యూపీ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరుతో శుక్రవారం లేఖ విడుదలైంది. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మేడిగడ్డ బ్యారేజీని నిర్మించారని అన్నారు. 2016 మే 2న నిర్మాణం మొదలుపెట్టి, 2019 జూన్ 21న ప్రారంభించారన్నారు. అయితే మూడు సంవత్సరాల్లోనే ప్రాజెక్టు దెబ్బతిందని తెలిపారు.

మేడిగడ్డ బ్యారేజీ కూలి పోవడానికి కేసీఆర్ కుటుంబమే కారణమని ఆరోపించారు. పెద్ద మొత్తంలో కమీషన్లు తీసుకుని నాసిరకంగా నిర్మించారని ఆరోపించారు. నిర్మాణ సమయంలోనే పగుళ్లు ఏర్పడినా, బయటి ప్రపంచానికి తెలియనివ్వలేదన్నారు. ప్రజలను, ప్రజాసంఘాలను కూడా అడ్డుకున్నారని అన్నారు. పోలీసు సిబ్బంది సాయంతో ముందస్తుగా అరెస్టులు చేసి వారిని ధర్నాలు, ర్యాలీలు చేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. విషయం బయటకు రాకుండా అణిచివేశారని.. మీడియాను కూడా బెదిరించి కంట్రోల్ చేశారన్నారు. ప్రజాధనం వృధా చేసిన కేసీఆర్ దే పూర్తి బాధ్యత అని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు.

కుంగిన వంతెన..

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ కుంగింది. గత శనివారం సాయంత్రం బ్యారేజీ వద్ద ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చి, 7వ బ్లాక్‌లోని 20వ పియర్‌ వద్ద దిగువన పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో బ్యారేజీపై ఉన్న వంతెన కుంగి ప్రమాదకరంగా మారింది. వంతెనపై సైడ్‌ బర్మ్‌ గోడ, ప్లాట్‌ఫారంతోపాటు రోడ్డు సుమారు 2, 3 ఫీట్ల మేర కుంగిపోయాయి. దీంతో బ్యారేజీ గేట్లు కూడా ప్రమాదకరంగా మారాయి.

Also Read:

ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీటిని తాగితే 5 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..

పదవి విరమణ తరువాత నెలవారీగా పెన్షన్ పొందాలనుకుంటున్నారా? ఈ పథకం బెస్ట్!

Advertisment
తాజా కథనాలు