Bharat Bandh: నేడు భారత్ బంద్... మావోయిస్టుల పిలుపు

ఈ రోజు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. బుధవారం ఛత్తీస్ ఘడ్ లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. భారత్ బంద్ కు పిలుపునివ్వడంతో తెలంగాణ, ఏపీ, ఛత్తీస్ గఢ్ సరిహద్దులో భారీగా పోలీసులు మోహరించారు.

New Update
Bharat Bandh: నేడు భారత్ బంద్... మావోయిస్టుల పిలుపు

Maoists Calls For Bharat Bandh Today: ఈ రోజు భారత్ బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి జిల్లా (Bhadradri) ఏజెన్సీలో హైఅలెర్ట్ ప్రకటించారు పోలీసులు. తెలంగాణ, ఛత్తీస్ గఢ్ (Chhattisgarh) సరిహద్దులో కూంబింగ్ చేపట్టారు పోలీస్ అధికారులు. దండకారణ్యాన్ని భద్రత బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు పోలీస్ యంత్రంగం. ఇదిలా ఉండగా ఏపీలో విధ్వసం సృష్టించారు మావోయిస్టులు. అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. వీరాపురం దగ్గర వాహనాలపై మావోయిస్టులు దాడి చేశారు. కార్లకు నిప్పంటించారు. ఈ నెల 22న అంటే ఈ రోజు తాము ఇచ్చిన భారత్ బంద్ పిలుపుని విజయవంతం చేయాలంటూ కరపత్రాలను వదిలి వెళ్లారు మావోయిస్టులు. అయితే మావోయిస్టుల డిమాండ్స్ పై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. నిన్న పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పులలో 8 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి నిరసనగా ఈరోజు భారత్ బంద్ కు మావోయిస్టులు పిలుపు నిచినట్లు తెలుస్తోంది.

Also Read: కరోనా జేఎన్.1 వైరస్.. టెన్షన్ అక్కరలేదు

బుధవారం ఛత్తీస్ గఢ్ లో భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు

ఛత్తీస్ గఢ్ లోని మావోయిస్టులకు, పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. సుక్మాజిల్లా నాగారం పోలీస్ స్టేషన్ పరిథిలోని దండకారణ్యంలో మావోయిస్ట్ బేస్ క్యాంపులను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. ఇందులో భారీ మొత్తంలో మావోయిస్టుల సామాగ్రిని, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో భద్రతాబలగాలు ఎనిమిది మంది మావోస్టులను చంపినట్టు అధికారిక వర్గాల నుంచి సమాచారం.

Also Read: పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం అవ్వండి.. హైదరాబాద్ కార్పొరేటర్లకు కేటీఆర్ పిలుపు!

Advertisment
తాజా కథనాలు