Lotus Flower Juice Benefits: మహిళలకు వరం.. తామర పువ్వుల రసం..ఎన్నో సమస్యలకు చెక్

పల్లెటూర్లలో ఎక్కువగా కనిపించే తామర పువ్వులను పూజల్లో ఉపయోగిస్తారు. కొందరైతే.. తామర గింజల్ని కూడా ఆహారంగా తీసుకుంటున్నారు. ఈ తామర పువ్వుల డ్రింక్ తాగితే మంచి ఫలితం ఉంటుంది. గుండె ఆరోగ్యానికి, కిడ్నీలు హెల్తీగా ఉండాలంటే తామర పువ్వుల డ్రింక్ చాలా మంచిది.

New Update
Lotus Flower Juice Benefits: మహిళలకు వరం.. తామర పువ్వుల రసం..ఎన్నో సమస్యలకు చెక్

Lotus Flower Juice Benefits: పల్లెటూర్లలో తామర పువ్వులు ఎక్కువగా చూస్తుంటారు. ఈ పువ్వులను పూజల్లో ఉపయోగిస్తారు. కొందరైతే.. తామర గింజల్ని కూడా ఆహారంగా తీసుకుంటున్నారు. మార్కెట్‌లో తామర గింజలకి ఎక్కువ డిమాండ్ ఉంది. అయితే.. తామర పువ్వుతో ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చన్న విషయం చాలా మంది తెలియదు. అనేక అనారోగ్య సమస్యల్ని దూరం చేయడానికి తామర పువ్వులు దివ్యౌషధంగా పని చేస్తాయని నిపుణులు అంటున్నారు. వీటిల్లో.. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, బ్యాక్టీరియల్, ఆక్సిడెంట్ల లక్షణాలు అధికంగా ఉన్నాయి. అలాగే మెగ్నీషియం, ఐరన్, కాల్యిషయం, క్లోరిన్, ఫాస్పరస్, పోటాషియం వంటి అనేక ఖనిజాలు ఉన్నాయి. తామర పువ్వులను ఆయుర్వేదంలో కూడా ఔషధంగా ఉపయోగిస్తారు. వీటితో చికాకు, జ్వరం, తలనొప్పి వంటి సమస్యలు తగ్గించుకోవచ్చు. తామర పువ్వులతో తయారు చేసే ఈ డ్రింక్ తాగితే అనేక రోగాలను దూరం చేయవచ్చు. తామర పువ్వులతో డ్రింక్‌ తాగితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
లోటస్ ఫ్లవర్ డ్రింక్ తయారీ:

  • ఈ తామర పువ్వుల డ్రింక్ చాలా సులభంగా తయారు చేసుకోచ్చు. ముందుగా ఒక లోతైన గిన్నెలో కొద్దిగా నీరు వేసి మరిగించుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ నీటిలో తామర పువ్వులు వేసి రెండు గంటలు అయిన తరువాత వీటిని ఫిల్డర్ చేసి తాగితే మంచి ఫలితం ఉంటుంది.
  • ఇలా తామర పువ్వుల డ్రింక్ తాగితే అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయి. ఈ డ్రింక్ జ్వరంగా ఉన్నప్పుడు తాగితే.. శరీరంలో ఉష్ణోగ్రత కంట్రోల్‌తో ఉంటాయి.
  • తలనొప్పి, చికాకు ఉన్నప్పుడు ఈ డ్రింక్ తాగితే ఉపశమనం ఉంటుంది. అంతేకాదు ఈ డ్రింక్‌ ముఖాన్ని మెరిసేలా చేస్తుంది.
  • గుండె ఆరోగ్యానికి, కిడ్నీలు హెల్దీగా ఉండాలంటే తామర పువ్వుల డ్రింక్ చాలా మంచిది.
  • మహిళలు నెలసరి సమయంలో బ్లీడింగ్ ఎక్కువగా అయ్యే వాళ్లకు ఈ డ్రింక్ తాగడం వల్ల రక్త స్రావం కంట్రోల్‌లో ఉంటుంది.
  • ఈ డ్రింక్‌ను గర్భిణీలు, పాలు ఇచ్చే తల్లులు, హైపోగ్లైసీమియా ఉన్న వారు అస్సలు తాగకుడదు.
  • రక్తంలో చక్కెర స్థాయిలను, అధిక దాహాన్ని తగ్గించడంతో ఈ డ్రీంక్‌ తగ్గిస్తుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: జుట్టు సంరక్షణకు మామిడి ఆకులు..ఇలా వాడండి

Advertisment
Advertisment
తాజా కథనాలు