Olympics: ఒలింపిక్స్‌లో బోణీ కొట్టిన భారత్‌.. షూటింగ్‌లో మను బాకర్‌కు కాంస్యం

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బోణి కొట్టింది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ షూటింగ్ విభాగంలో మను బాకర్‌ కాంస్య పథకం దక్కించుకుంది. ఒలింపిక్స్‌లో మహిళా షూటింగ్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళగా ఆమె రికార్డ్ సృష్టించింది.

Olympics: ఒలింపిక్స్‌లో బోణీ కొట్టిన భారత్‌.. షూటింగ్‌లో మను బాకర్‌కు కాంస్యం
New Update

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బోణి కొట్టింది. ఎయిర్‌ పిస్టల్‌ షూటింగ్ విభాగంలో మను బాకర్‌ కాంస్య పథకం దక్కించుకుంది.10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్‌ ఫైనల్లో ఆడిన ఆమె.. 221.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్‌లో మహిళా పిస్టల్‌ షూటింగ్‌ విభాగంలో పథకం సాధించిన మొదటి మహిళగా మను బాకర్ రికార్డు సృష్టించింది.

Also Read: ఐదేళ్లలో 633 మంది భారతీయ విద్యార్థులు మృతి: కేంద్రం!

ఫైనల్‌లో మను బాకర్‌ 221.7 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఇక దక్షిణ కొరియా షూటర్లు ఓహ్‌ యే జిన్ (243.2 పాయింట్లు) గోల్డ్‌, కిమ్‌ యేజే (241.3 పాయింట్లు) సిల్వర్‌ పథకాలు సాధించారు. కాంస్య పథకం సాధించడంపై మను బాకర్ సంతోషం వ్యక్తం చేసింది. భారత్ మరిన్ని పతకాలు గెలుచుకుంటుందని తెలిపింది. మరోవైపు పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో అర్జున్‌ బబుతా ఫైనల్‌కు చేరాడు. అతడు 630.1 స్కోరుతో ఏడో స్థానంలో నిలిచాడు.

#olympics #manu-bhaker
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe