హైదరాబాద్ వాసులు నీటిని వాడుకోవడంలో పొదుపుగా ఉండాలి. ఎందుకంటే 24 గంటల పాటు నగరంలో నీరు బంద్ కానుంది. నీటిని జాగ్రత్తగా వాడుకోవాలి అని అధికారులు హెచ్చరించారు. బుధవారం నుంచి 24 గంటల పాటూ..అంటే గురువారం వరకూ నగరంలో మంచి నీటి సరఫరా నిలిచిపోనుంది.
గురువారం నాడు కూడా నీరు వస్తుంది కానీ..ఏ సమయానికి వస్తుందో కచ్చితంగా చెప్పాలేమంటూ అధికారులు పేర్కొన్నారు. అందుకే నీటిని పట్టుకోవాలి అనుకునే వారు మంగళవారం నాడే పట్టుకొని ముందు జాగ్రత్తగా ఉంచుకోవాలని అధికారులు తెలిపారు. అసలు 24 గంటలపాటు నీరు రాకుండా ఉండేందుకు ముఖ్య కారణం ఏంటంటే..
Also read: ముఖేష్ అంబానీకి మూడోసారి బెదిరింపు ఈ-మెయిల్..400 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం!
మంజీరా నీటిని సరఫరా చేస్తున్న పైపులకు అక్కడక్కడా లీకేజీ సమస్యలు ఉన్నాయి. అయితే చాలా కాలంగా అవి పెండింగ్ లో ఉన్నాయి. దాంతో సిటీకి వచ్చే నీరు లీకైపోవడంతో నీటి సరఫరా తగ్గిపోతోంది. అందువల్ల లీకేజీలకు రిపేర్లు చేయాలని అధికారులు నిర్ణయించారు. దాని వల్లే ఒకరోజు అంటే...24 గంటల పాటు నీటి సరఫరా ఉండదు.
ఏఏ ప్రాంతాల్లో నీళ్ల సరఫరా నిలిచిపోనుందంటే... అమీర్‌పేట, ఎస్‌ఆర్ నగర్, ఎర్రగడ్డ ప్రాంతాల్లో లో ప్రెజర్ తో నీటి సరఫరా ఉంటుంది. అంటే నీరు రోజు వచ్చినా.. గతంలో మాదిరిగా సరిపడా రావు. కూకట్ పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, మదీనాగూడ, లింగంపల్లి, దీప్తిశ్రీనగర్, వసంత్ నగర్, మియాపూర్, భాగ్యనగర్ కాలనీలకు పూర్తిగా నీటి సరఫరా ఆగిపోతుంది.
Also read: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్…3,220 పోస్టులకు నోటిఫికేషన్!