HMWSSB Updates: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ ప్రాంతాలకు నీటి సరఫరా బంద్.. వివరాలివే!
హైదరాబాద్ నగర వాసులు 24 గంటల పాటు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు తెలిపారు. బుధవారం నుంచి గురువారం వరకు అమీర్పేట, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, కూకట్ పల్లి, కేపీహెచ్బీ కాలనీ, మదీనాగూడ, లింగంపల్లి, దీప్తిశ్రీనగర్, వసంత్ నగర్, మియాపూర్, భాగ్యనగర్ కాలనీల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని వెల్లడించారు.