Manish Sisodia: లిక్కర్ కుంభకోణం కేసులో (Liquor Scam Case) ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టైన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా ఆయన తిహార్ జైల్లో రిమాండ్‌లో ఉంటున్నారు. అయితే సిసోడియా శనివారం జైలు నుంచి బయటకు వచ్చారు. కొన్నిరోజులుగా ఆయన భార్య అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆమెను చూసేందుకు సిసోడియాకు (Manish Sisodia) కోర్టు అనుమతిచ్చింది. కేవలం ఆరు గంటలు పాటు మాత్రమే స్పెషల్ పర్మిషన్ ఇచ్చింది. అలాగే ఈ ఆరు గంటల్లో మీడియాతో మాట్లడవద్దని.. ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు చేయకూడదంటూ షరతు విధించింది. దీనికి అంగీకరించిన ఆయన.. తన భార్య సీమా సిసోడియాను చూడటానికి ఢిల్లీలోని తన నివాసానికి వెళ్లారు.
Also read: అదానీ సంస్థ రూ.13 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడింది.. మొయిత్రా సంచలన ఆరోపణలు..
సిసోడియా భార్య ప్రస్తుతం మల్టీపుల్ స్క్లిరోసిస్‌తో బాధపడుతున్నారు. జూన్‌లో కూడా సిసోడియా తన భార్యను చూసేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో జైలు నుంచి ఇంటికి వచ్చారు. అయితే అప్పుడు ఆమె ఆరోగ్యం క్షీణించడం వల్ల ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో సిసోడియా తన భార్యను చూడకుండానే జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. లిక్కర్ స్కామ్ కేసులో ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్టయిన సిసోడియా అప్పటి నుంచి తీహార్ జైలులోనే రిమాండ్‌లో ఉంటున్నారు. ఆయన పలు బెయిల్ పిటిషన్లు వేసినప్పటికీ కోర్టులు వాటిని రిజెక్ట్ చేశాయి.
Also Read: నాడు రక్తపు మరకలు..నేడు వెలుగు జిలుగులు.. ఈ సారి దీపావళి తేదీ ప్రత్యేకత ఇదే..!