Mani Shankar Aiyar: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళలో కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి షాకింగ్ కామెంట్స్ వస్తున్నాయి. నిన్నటికి నిన్న శామ్ ప్రిటోడా చేసిన కామెంట్స్ తో కాంగ్రెస్ ఇరకాటంలో పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు మణిశంకర్ అయ్యర్ ఏప్రిల్ నెలలో చేశారని చెబుతున్న కొన్ని వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. పాకిస్తాన్ ను భారత్ గౌరవించాలని ఆ వీడియోలో మణిశంకర్ అయ్యర్ అంటున్నట్టుగా ఉంది. జాతీయస్థాయిలో మీడియాలో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. మణిశంకర్ అయ్యర్ ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. అందులో “పాకిస్తాన్ ను భారత్ గౌరవవించాలి. ఎందుకంటే, పాకిస్తాన్ దగ్గర అణుబాంబు ఉందన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఏ పిచ్చివాడైన అక్కడ అధికారంలోకి వస్తే దానిని మన మీద వాడుకోవచ్చు” అంటూ మణిశంకర్ అంటున్నట్టు ఉంది.
Mani Shankar Aiyar: అంతేకాకుండా, “పాకిస్తాన్‌లో ఉగ్రవాదం ఉంది కాబట్టి మనం మాట్లాడబోమని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎందుకు చెబుతుందో నాకు అర్థం కావడం లేదు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి చర్చలు చాలా ముఖ్యమని అర్థం చేసుకోవాలి. లేకుంటే భారత్ దురహంకారంతో ప్రపంచంలో మనల్ని చిన్నచూపు చూస్తున్నదని పాకిస్థాన్ భావిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్‌లోని ఏ పిచ్చివాడైనా ఈ బాంబును భారత్‌పై ప్రయోగించవచ్చు.” అంటూ ఆ వీడియోలో మణిశంకర్ చెబుతున్నట్టుగా ఉంది.
మణిశంకర్ అయ్యర్ ఇంటర్వ్యూ వీడియోను బీజేపీ నేత ఒకరు x లో పోస్ట్ చేశారు. ఆ ట్వీట్ ఇక్కడ మీరు చూడవచ్చు.
Also Read: దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా.. తూర్పున చైనీస్ లా.. శామ్ పిట్రోడా కొత్త వివాదం!
Mani Shankar Aiyar: మణిశంకర్ అయ్యర్ కంటే ముందు ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న శామ్ పిట్రోడా కూడా ఎన్నికల సమయంలో రెండు ప్రకటనలు ఇవ్వడంతో కాంగ్రెస్ కష్టాల్లో పడింది. భారతదేశంలో వారసత్వపు పన్ను విధించడం గురించి ఆయన మాట్లాడారు. దీనిపై రాహుల్ గాంధీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారని పిట్రోడా రెండు రోజుల క్రితం ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో తరువాత పిట్రోడా తన కాంగ్రెస్ పదవికి రాజీనామా చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ వాళ్లు చర్మం రంగు చూసి దేశ ప్రజలను విడదీస్తున్నారని అన్నారు. పిట్రోడా ప్రకటనకు కాంగ్రెస్ దూరంగా ఉంది. కొన్ని గంటల తర్వాత, పిట్రోడా కాంగ్రెస్ ఓవర్సీస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
ఇక ప్రస్తుత వైరల్ వీడియోలో అయ్యర్ ఏమన్నారంటే...
Mani Shankar Aiyar: “పాకిస్థాన్ కూడా సార్వభౌమాధికార దేశమే. అది కూడా గౌరవించబడాలి. వారి గౌరవాన్ని కాపాడుకుంటూ, వారితో మీకు కావలసినంత కఠినంగా మాట్లాడండి, కానీ కనీసం మాట్లాడండి. నువ్వు తుపాకీతో తిరుగుతున్నావు. అతను దాని నుండి ఏమి పరిష్కారం పొందాడు ... ఏమీ లేదు. టెన్షన్ పెరుగుతుంది. ఏ పిచ్చివాడు అయినా అక్కడికి వస్తే దేశం ఏమవుతుంది?
వారి వద్ద అణు బాంబులు ఉన్నాయి. మన దగ్గర అది కూడా ఉంది, కానీ ఎవరో పిచ్చివాడు లాహోర్ స్టేషన్‌లో ఆ బాంబును వదిలివేస్తే, దాని రేడియో కార్యకలాపాలు ఎనిమిది సెకన్లలో అమృత్‌సర్‌కు చేరుకుంటాయి. మీరు మీ దగ్గర ఉన్న బాంబును ఉపయోగించడం మానేయండి. కానీ మీరు అతనితో (పాకిస్తాన్) మాట్లాడండి.. అతని(పాకిస్తాన్)కి గౌరవం ఇవ్వండి. అప్పుడు మాత్రమే అతను(పాకిస్తాన్) తన బాంబు గురించి ఆలోచించడు. కానీ మీరు అతన్ని(పాకిస్తాన్) తిరస్కరించినట్లయితే ఏమి జరుగుతుంది? భారతదేశం ప్రపంచ అగ్రగామిగా ఎదగాలంటే, పాకిస్తాన్‌తో అన్ని సమస్యలను పరిష్కరించడానికి మనం వేగంగా పనిచేస్తున్నామని చూపించడం చాలా ముఖ్యం. గత పదేళ్లలో పాకిస్థాన్‌తో చర్చల దిశగా మోదీ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదు.” అంటూ మణిశంకర్ అయ్యర్ వైరల్ అవుతున్న తన ఇంటార్వ్యూ వీడియోలో చెప్పారు.
బీజేపీ ఫైర్..
మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అవుతోంది. బీజేపీ నాయకులూ ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందించారంటే..
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్: కాంగ్రెస్ నాయకులు భారతదేశంలో నివసిస్తున్నారు, కానీ వారి హృదయం పాకిస్తాన్‌లో నివసిస్తుంది. భారత్ వైపు చూసే ధైర్యం పాకిస్థాన్‌కు లేదు. అలంటి పరిస్థితి వస్తే ఎలా తగిన సమాధానం చెప్పాలో భారత్‌కు తెలుసు.
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్: రాహుల్ గాంధీ, కాంగ్రెస్, మణిశంకర్ అయ్యర్ పాకిస్థాన్ భాష మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఈ ద్వంద్వ విధానాన్ని విడనాడాలని నేను చెప్పాలనుకుంటున్నాను. భారతదేశం చాలా శక్తివంతమైనది. ఒకవేళ అది మన వైపు చూస్తే పాకిస్తాన్ ఇక ఉండదు. వారు ఫరూక్ అబ్దుల్లా భాష మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పాకిస్థాన్ ఉగ్రవాదుల భాష మాట్లాడుతుంది.
బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా: కాంగ్రెస్ 'పాకిస్థాన్ ప్రేమ' ఆగడం లేదు. 'తొలి కుటుంబం'కి సన్నిహితుడైన మణిశంకర్ అయ్యర్ కండలు, బలాన్ని ప్రదర్శిస్తున్నాడు. కాంగ్రెస్ జాబితా చూడండి - వారికి మొదట పాకిస్తాన్ నుండి మద్దతు లభించింది. 26/11లో కసబ్‌కు క్లీన్ చిట్ లభించింది. కాంగ్రెస్ హస్తం పాకిస్థాన్‌తో ఉంది.