మంగళగిరి చేనేతకు దక్కిన అరుదైన గౌరవం

New Update
మంగళగిరి చేనేతకు దక్కిన అరుదైన గౌరవం

ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి చీరలకు పెట్టింది పేరు. ఇక్కడ తయారయ్యే చీరలకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. జాతీయ స్థాయిలోనే కాదు.. అంతర్జాతీయంగా కూడా ఎంతో పేరు ఉంది. తాజాగా ఈ చీరలకు మరో అరుదైన గౌరవం లభించింది. చేనేతకు జీఐ గుర్తింపు లభించింది.

ఆగష్టు 7వ తేదీన చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ.. నేతన్నలతో వర్చువల్ గా మాట్లాడనున్నారు. ఇందుకోసం దేశంలోని 75 మంది చేనేత కార్మికులు, ఉత్పత్తిదారులను ఎంపిక చేశారు. ఇందుకోసం కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు దేశ వ్యాప్తంగా పర్యటించాయి. ఒక బృందం మంగళగిరిలో చేనేత కార్మికులు కోసం నిర్మిస్తున్న మగ్గం షెడ్లు, చేనేత భవన సముదాయాన్ని పరిశీలించింది.

అలాగే ప్రభుత్వం చేనేత కార్మికులకు అందిస్తున్న చేనేత నేస్తం పతకంపై కూడా ఆరా తీసింది. ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత మంగళగిరిలో ఇంకా చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో ఉండటం, చేనేతను కాపాడుకునే ప్రయత్నం చేస్తుండటంతో మంగళగిరి నేతన్నను ప్రధాని మాట్లాడేందుకు ఎంపిక చేసింది.

ఈ విషయాన్ని కేంద్ర జౌళి శాఖాధికారులు స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇచ్చారు. వచ్చే నెల 7వ తేదీన ప్రధానితో వర్చువల్‌ గా మాట్లాడేందుకు మగ్గం షెడ్ల ప్రాంగణాన్ని సిద్దం చేయాలని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు.

అదే విధంగా ప్రధాని మాట్లాడనున్న వారిని కూడా ఎంపిక చేసి వారి పేరు కేంద్రానికి పంపాలని ఎమ్మెల్యే సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మంగళగిరి దక్కిన అరుదైన అవకాశంగా దీనిని భావిస్తున్నామని ఎమ్మెల్యే ఆర్కే వెల్లడించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు