/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-28T125446.271-jpg.webp)
Manda Krishna Madiga: తెలంగాణ ఎన్నికల ప్రచారానికి మరి కొన్ని గంటల సమయం మిగిలివుండటంతో నాయకులంతా ఉరుకులు పరుగులు తీస్తున్నారు. వీలైనంత త్వరగా ఎక్కువమంది ప్రజలను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగైనా గెలవాలనే తపనతో తమ నియోజకవర్గంలో ముమ్మరంగా పర్యటిస్తున్నారు. తమకు మద్దతుగా నిలిచే ఇతర పార్టీ నాయకులతో కలిసి రోడ్ షోలు, బైక్, తదితర పద్ధతుల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Bandi-Sanjay-Kumar-visits-BJP-candidate-Srisailam-Goud-in-Kutbullapur-jpg.webp)
ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ (MP Bandi Sanjay Kumar) కరీంనగర్ లోని పలు ప్రాంతాల్లో చేపట్టిన బైక్ ర్యాలీకి పెద్ద ఎత్తున యువకులు తరలివచ్చారు. అలాగే ఈ ర్యాలీకీ ముఖ్యఅతిథిగా వచ్చిన ఎమ్మార్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బండి సంజయ్ ముఖ్యమంత్రి (BJP CM) అవుతారని మందకృష్ణ మాదిగ అన్నారు. ప్రధానమంత్రి మోడీతో పాటు ఇతర అగ్ర నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయని, బండి సంజయ్ ఒక యుద్ధ వీరుడు అని కృష్ణ మాదిగ కొనియాడారు. ఈసారి చారిత్రాత్మకమైన సందర్భాలున్నాయన్నాన్నారు. ఎందుకంటే ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చినా 70 శాతానికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మూడు వర్గాలకు ఏ మేలు జరుగలేదని, ఈసారి బీసీ ముఖ్యమంత్రి అవకాశం వచ్చినపుడే సద్వినియోగం చేసుకోవాలన్నారు. బండి సంజయ్ ని గెలిపిస్తే బడుగు బలహీన వర్గాల రాజ్యాన్ని గెలిపించినట్లేనని, మొదటిసారి బీసీలకు అవకాశం రాబోతున్నందుకు ఓసీలు కూడా సహకరించాలన్నారు. పేద వర్గాల అందరికీ అండగా నిలబడ్డ బండి సంజయ్ గెలిస్తే తప్పకుండా న్యాయం జరుగుతందని. కరీంనగర్ ప్రజలు లక్ష మెజారిటీతో గెలిపించాలని కోరారు.
Also read : ఇందిరాగాంధీతో కంగన ఇంటర్య్వూ.. కల సాకారమైందంటూ పోస్ట్
ఇక ఆదివారం కరీంనగర్ ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన బండి సంజయ్.. రాష్ట్రంలోని అన్ని వర్గాలు కరీంనగర్ ప్రజల తీర్పు కోసం ఎదురు చూస్తున్నయ్. కరీంనగర్ ప్రజలారా ఏకం కండి. పేదల కోసం కొట్లాడుతున్న నన్ను గెలిపించండి. ఒక్క అవకాశం ఇస్తే ఐదేండ్లు మీకు సేవ చేసుకుంటా. కరీంనగర్‌కు రక్షణ కవచంగా నిలుస్తా అన్నారు. అలాగే తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న నాయకులు ఆధారాలతో రావాలని సవాలు చేశారు. తాను అవినీతికి పాల్పడినట్లు రుజువు చేస్తే ప్రమాణపూర్తిగా తన ఆస్తి మొత్తాన్ని కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు రాసిస్తానని సవాల్ చేశారు.
Follow Us